నాన్నకు ప్రేమతో.. ఈ విజయం

201602060206030113100

ఎవరూ కూడా కలలో ఊహించని విజయం.. గడిచిన గ్రేటర్ లో ఎన్నికల్లో కనీసం పోటీచేయడానికి కూడా సాహసించని పార్టీని గ్రేటర్ లో గెలిపించడమంటే మాటలు కాదు.. క్యాడర్ ను బలోపేతం చేసి గ్రేటర్ లో కేటీఆర్ పన్నిన వ్యహాలు నభూతో నభవిష్యతి రీతిలో ఉంది.. కేసీఆర్ పెట్టిన పరీక్షలో నెగ్గారు కేటీఆర్.. తొలిసారి నాయకత్వ పరీక్షకు ఎదురునిలిచి నాన్నను మించి రాజకీయంలో మాస్టర్ డిగ్రీ పొందాడు కేటీఆర్.. నాన్న కు ప్రేమతో గ్రేటర్ పీఠాన్ని కట్టబెట్టారు.. జీహెచ్ఎంసీ ఎన్నికల ఇన్ చార్జిగా నియమించి కేసీఆర్ తన కొడుకైన కేటీఆర్ కు పరీక్ష పెట్టారు. ఈ పరీక్షలో నూటికి 150 మార్కులు సాధించి విజేతగా నిలిచాడు కేటీఆర్ .. ఎంతో ముందుచూపుతో నాన్న చూపిన బాటలో నడిచి గ్రేటర్ లో ప్రతిపక్షాలను కకావికలం చేశాడు..

గ్రేటర్ గెలుపు ముమ్మాటికి కేటీఆర్ కష్టంతో వచ్చింది. ఆయన ప్రతీ గల్లీని తిరిగి సీమాంద్రులను మచ్చిక చేసుకొని.. పేదల కష్టాలు విని.. హామీలు ఇచ్చి ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టమే గ్రేటర్ లో ఓట్ల రూపంలో కనిపించింది. కేసీఆర్ కు తగ్గ కొడుకు కేటీఆర్ ఇప్పుడు టీఆర్ఎస్ లో పేరుపొందారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *