
కళ్ళు మూసుకుని ప్రేమించేది ప్రియురాలు
కళ్ళు తెరుచుకుని ప్రేమించేది స్నేహితురాలు
కళ్ళు ఉరిమి ప్రేమించేది భార్య
కళ్ళు మూసేవరకూ ప్రేమించేది అమ్మ
*కళ్ళల్లో ప్రేమ కనబడకుండా ప్రేమించేది నాన్న…*
అమ్మ .. ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది.
నాన్న .. ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తాడు.
జీవితం అమ్మది — జీవనం నాన్నది .
ఆకలి తెలీయకుండా అమ్మ చూస్తుంది .
ఆకలి విలువ తెలిసెలా నాన్న చేస్తాడు .
అమ్మ భద్రత — నాన్న బాధ్యత .
పడిపోకుండా పట్టుకోవాలని అమ్మ చూస్తుంది.
పడినా పైకి లేవాలని నాన్న చెప్తాడు .
నడక అమ్మది — నడవడిక నాన్నది .
తన అనుభవాలను విద్యలా బోధిస్తుంది అమ్మ.
నీ అనుభవమే విద్య అని తెలిసెలా చేస్తాడు నాన్న .
అమ్మ అలోచన— నాన్న ఆచరణ.
అమ్మ ప్రేమను నీ పసిప్రాయం నుండే తెలుసుకొగలవు.
కానీ ….
నాన్న ప్రేమను నువ్వు నాన్నవు అయ్యాకే తెలుసుకోగలవు…