నాతోనా మీ గేమ్స్

ఈనాడు.. ఆంధ్రజ్యోతి పత్రికలు తెలంగాణ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ను ఓ ఆట ఆడుకుంటన్నాయి.. పైకి ఈ నాడు రామోజీరావు, కేసీఆర్ లు చెట్టాపట్టాల్ వేసుకొని కనిపిస్తున్నా లోలోపల మాత్రం రామోజీరావు తన పత్రిక ద్వారా రోజు ఏదో ఒక ఇష్యూను రేజ్ చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. మరో వైపు తెల్లవారే ప్రభుత్వ వివరణను ప్రచురిస్తూ అటూ కేసీఆర్ తో దోస్తీని ఇటు పత్రికతో కత్తిని చాలా సమయోచితంగా దూస్తున్నారు. మొన్న హైదరాబాద్ నడిబొడ్డున రైతు ఆత్మహత్య వివాదాన్ని బ్యానర్ గా ప్రచురించి రామౌజీ కేసీఆర్ ప్రభుత్వ తీరును ఎండగట్టడం విశేషం.. ఇలా సందు దొరికితే వాయించేస్తున్నారు రామోజీ రావు..

ఈనాడు రామోజీ తెలివితేటలు..

ఎంతైనా ఆంధ్రా తెలివి తేటలు కదా అంతా ఈజీగా పోవని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వంతో సఖ్యత అంటూనే ఆంధ్రా బాబు కనుసన్నల్లో రామోజీరావు రెచ్చిపోతూ చాపకింద నీరులా తెలంగాణ ప్రభుత్వంపై వ్యతిరేక కథనాలు ఈనాడు మొదటిపేజీలో వస్తున్నాయి.. చూడడానికి ప్రభుత్వానికి మద్దతుగా రాస్తున్నట్టే కనపడినా అందులో వ్యతిరేకత ఉట్టిపడుతోంది..

ఇక ఆంధ్రజ్యోతి డైరెక్ట్ అటాక్

ఇక తెలంగాణ వచ్చినప్పటినుంచి కేసీఆర్ నిషేధించిన ఏబీఎన్ ఆంద్రజ్యోతి రాతల్లో టీఆర్ఎస్ ను తెలంగాణ ప్రబుత్వాన్ని చీల్చి చెండాడుతోంది. మొన్న హైదరాబాద్ రైతు ఆత్మహత్యపై ఈనాడు అంత కాకున్నా రెచ్చిపోతూ వివరణలతో చిచ్చురేపింది ఆంధ్రజ్యోతి.. వ్యతిరేకంగా ఎక్కడ ధర్నా చేసినా.. ఎవరైనా కేసీఆర్ తిట్టినా.. ఆ తిట్టిన పదంతోనే హెడ్డింగ్ పెట్టి కసి తీర్చుకుంటోంది..

కేసీఆర్ మేల్కోవాలి..

అటు రామోజీ, ఇటు రాధకృష్ణల దాడులతో కేసీఆర్ మేల్కోలేకపోతే దారుణంగా వచ్చే ఎన్నికల్లో పరాజయం తప్పదు.. నమస్తే తెలంగాణతో ఎన్ని రాతలు రాయించినా ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రచారం ముందు దిగదుడుపే.. అందుకే రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగళ్లతో దున్నే ప్రొగ్రాం మళ్లీ ఇంప్లీమెంట్ చేయాలని టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ ను కోరుతున్నారట.. ఆంధ్రజ్యోతితో పాటు ఈనాడుపై ఇలా కసి తీర్చుకోవాలని గుస్సుమంటున్నారట.. చూడాలి ఏమౌతుందో..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.