Breaking News

నాణ్యమైన విత్తనాల సరఫరాతో రాష్ట్రంలో వ్యవసాయ శాఖకు ప్రాధాన్యత పెరిగింది – మంత్రి పొచారం

నాణ్యమైన విత్తనాల సరఫరాతో రాష్ట్రంలో వ్యవసాయ శాఖకు ప్రాధాన్యత పెరిగింది - మంత్రి పొచారం

24 గంటల నిరంతర విధ్యుత్తు, ముందస్తు పెట్టుబడిగా ఎకరాకు రూ.8000, కోటి ఎకరాలకు సాగునీరు, నాణ్యమైన విత్తనాల సరఫరాతో రాష్ట్రంలో వ్యవసాయ శాఖకు ప్రాధాన్యత పెరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి అన్నారు.

ఈరోజు సచివాలయంలోని తన చాంబర్ లో వ్యవసాయ శాఖ-2018 క్యాలండర్‌ను, తెలంగాణ విత్తన దృవీకరణ ఏజెన్సీ డైరి-2018  వ్యవసాయ విస్తరణ అధికారుల డైరి-2018, ఉధ్యాన విశ్వవిద్యాలయం క్యాలెండర్-2018 లను విడుదల చేసిన మంత్రి గారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ వ్యవసాయ శాఖకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. 5000 ఎకరాలకు ఒక AEO, మండలానికి ఒక AO ను నియమించాం. గత ఏడాదితో రూ.17000 కోట్ల రుణమాఫీ పూర్తయింది. భవిష్యత్తులో రైతులు తిరిగి అప్పుల బారిన పడకుండా గౌరవంతో, సంతోషంగా బతకడానికి ఎకరాకు రూ. 8000 ను ముందస్తు పెట్టుబడిగా అందిస్తున్నాం.

pocharam 1

రాష్ట్రంలోని 24 లక్షల కరంటు మోటార్లకు ఇకనుంచి విధ్యుత్తు కోత లేదు. దేశంలో వ్యవసాయ రంగానికి 24 గంటలు కరంటు సరఫరా చేస్తున్న ఎకైక రాష్ట్రం తెలంగాణ. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగనీరందిస్తాం.  కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర తగ్గకుండా పంటల ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాం. గత ఏడాది రాష్ట్రంలో 5400  కోనుగోలు కేంధ్రాలను ఏర్పాటు చేసి లక్షలాది టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. మంచి దిగుబడులు రావాలంటే నాణ్యమైన విత్తనం అవసరం. తెలంగాణ విత్తన దృవీకరణ ఏజెన్సీకి దేశంలోనే మంచి పేరొచ్చింది. మన రాష్ట్ర ఏజెన్సీని 5 రాష్ట్రాలకు నోడల్ ఏజెన్సీగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలో  సీడ్ విలేజ్ ప్రోగ్రాంను ప్రోత్సహిస్తున్నాం. రైతులకు మూలవిత్తనం ఇచ్చి బైబ్యాక్ ద్వారా వారినుండి దృవీకరణ విత్తనాన్ని కొనుగోలు చేస్తున్నామన్నారు.

pocharam 2

రైతులకు అధిక ఆధాయాన్ని ఇచ్చేవి ఉధ్యాన పంటలు. రాష్ట్రంలో సుమారు 15 లక్షల ఎకరాలలో ఉధ్యాన పంటలు సాగవుతున్నాయి. ఉధ్యాన పంటల సాగును ప్రోత్సహించడానికి సూక్ష్మ బిందూ సేధ్యానికి బారీ ఎత్తున సబ్సీడీలను కల్పిస్తున్నామన్నారు. వ్యవసాయ, ఉధ్యాన, సెరీకల్చర్, సీడ్ కార్పొరేషన్ అంతా ఒక కుటుంబం. అన్ని శాఖల కృషితో 2018 లో రైతులకు మంచి పంటలు పండటానికి కృషిచేస్తాం. ప్రతి సీజన్లో ఖర్చులు పోను రైతుకు ఎకరాకు రూ. 50,000 మిగలాలన్నదే మా ఆశయం. అప్పులలో కూరుకుపోయిన రైతులను బయటకు తెచ్చి ఆత్మగౌరవంతో బతికడానికి వ్యవసాయ శాఖ అధికారులు కృషి చేయాలన్నారు.

pocharam 3

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్ధసారది IAS, కమీషనర్ యం జగన్మోహన్ IAS, ఉధ్యానశాఖ డైరెక్టర్ యల్. వెంకట్రామి రెడ్డి, విత్తన దృవీకరణ ఏజెన్సీ డైరెక్టర్ కేశవులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *