
అధికారంలో పదేళ్లు ఉన్నప్పుడు కూడా ఆమె పెద్దగా మాట్లాడలేదు.. మాట్లాడాల్సిన అవసరం కూడా పెద్దగా రాలేదు.. నాటి ప్రతిపక్షం బీజేపీకి నాయకుడే సరిగా లేని పరిస్థితి.. బిల్లులకు సైతం బీజేపీ పెద్దగా ఇబ్బంది పెట్టింది లేదు.. సోనియా, కాంగ్రెస్ ఇబ్బంది పడింది కేవలం మమతా బెనర్జీ వల్లే.. పార్లమెంటులో ఆమె వల్లే సోనియా చాలా సార్లు ఇబ్బందులు పడ్డారట.. ప్రతిపక్షంగా దుందుడుకుగా వ్యవహరించేది తృణముల్ కాంగ్రెస్ .. బీజేపీ పెద్దగా లొల్లి చేసింది లేదు..
దీంతో సోనియా ఇంటా పార్లమెంటులో చాలా సాదాసీదాగా ఎక్కడా ఆవేశంగా కనిపించేవారు కాదు.. కానీ మోడీ ప్రభంజనంతో ప్రతిపక్షంలో కనీస సీట్లు కాపాడుకోలేకపోయిన సోనియాగాంధీ లో మార్పు చాలా వచ్చింది.. ఇప్పుడు పూర్తి మెజారిటీ వచ్చిన బీజేపీనే ముప్పుతిప్పలు పెడుతోంది.. బిల్లులను పాతరేస్తోంది.. భూ సేకరణ బిల్లుకు అడ్డుపడుతోంది. తమ సవరణలు చేస్తేనే ఒఫ్పుకుంటుమని భీష్మించుకుటుంది.. పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేస్తే శివంగిలా పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు సోనియా… అంతేకాదు.. ఎప్పుడూ నోరు మెదపని నోటి నుంచి నిరసనలా నినదాలు వినడం జర్నలిస్టులను కాంగ్రెస్ నాయకులను సైతం ఆశ్చర్యపరిచాయి.. అధినేత్రి గట్టిగా నినిదాలు చేస్తూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుండడంతో ఇక కాంగ్రెస్ ఎంపీలు సభలో బయట మరింత దుందుడుకుగా వ్యవహరిస్తున్నారు.
మొత్తానికి ప్రతిపక్షంలో సోనియాలో బాగా మార్పు వచ్చింది.. పోరుబాటకు సై అంటోంది.. సోనియా ఇప్పుడు నయా శివంగిలా పార్లమెంటు కనిపిస్తోంది. బీజేపీని భయపెడుతోంది..