
-‘గాలి’కి బెయిల్ సరేనన్న సీబీఐ
-ప్రభుత్వాల చేతుల్లో కీలు బొమ్మగా సీబీఐ
ఢిల్లీ, ప్రతినిధి : ఓబులాపురం మైనింగ్ కేసులో గాలిజనార్ధన్ రెడ్డి జైలుపాలైన విషయం తెలిసిందే.. భారీగా గనులను కొల్లగొట్టాడని అప్పటి కాంగ్రెస్ హయాంలో నుంచి ఆయనపై సీబీఐ రైడ్ జరిగి ఆయన ఆస్తిని జప్తు చేసి జైలు పాలుచేశారు. 2011 సెప్పెంబర్ 5 నుంచి గాలి జనార్ధనరెడ్డి జైల్లోనే ఉన్నారు. అప్పటి కర్ణాటక బీజేపీకి గాలి అండదండలు పుష్కలంగా ఉండేవి. ఆయన వెచ్చించిన డబ్బుతోనే రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వం నడిచేది. దీంతో ఆయన బీజేపీలో కీలక నేతగా, ఎమ్మెల్యేగా కొనసాగారు.. కర్ణాటకలో గాలి ప్రభంజనం తగ్గించేందుకే కాంగ్రెస్ ఆయనను జైలు పాలు చేసిందని బీజేపీ శ్రేణులు విమర్శిస్తున్నారు. ఆయన అక్రమాలు నిజమే అయినా కాంగ్రెస్ కావాలనే ఇరికించిందనే పేరుంది. అందుకే కాంగ్రెస్ హయాం ముగిసే వరకు కూడా సీబీఐ చేత గాలికి బెయిల్ రాకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం..
కానీ 2014 ఎన్నికల్లో మోడీ ప్రభంజనంతో బీజేపీ గద్దెనెక్కడం తో పరిస్థితి మారింది. కాంగ్రెస్ అక్రమంగా బీజేపీ నేతలు, సానుభూతి పరులపై మోపిన కేసుల నుంచి విముక్తి కలుగుతోంది. మొన్నటికి మొన్న బిర్లా గ్రూప్ చైర్మన్ కు నిర్ధోషి సీబీఐ చేత చెప్పించిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంలో గాలికి బెయిల్ ఇచ్చేందుకు సీబీఐ సహకరించేలా చేశారు..
మంగళవారం గాలి బెయిల్ పిటీషన్ సుప్రీంలో విచారణకు రాగా సీబీఐ తమకు అభ్యంతరం లేదని.. షరతులతో బెయిల్ ఇవ్వొచ్చని చెప్పడం వెనుక బీజేపీ పెత్తనం ఉందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి..