Breaking News

నాటిన మొక్కలన్నింటికి జియో ట్యాగింగ్ చేయాలి

నాటిన మొక్కలన్నింటికి జియో ట్యాగింగ్ చేయాలి

కరీంనగర్: జిల్లాలో హరితహరంలో వివిధ శాఖల ద్వారా నాటిన మొక్కలన్నింటికి వెంటనే జియో ట్యాగింగ్ చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేటు సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో హరితహరం పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, హరితహరం కార్యక్రమం క్రింద నాటిన మొక్కలన్నింటికి రిజిస్టర్ చేయాలని ఆన్ లైన్లో అప్ లోడ్ చేయాలని, నాటిన మొక్కలను స్మార్ట్ ఫోన్ ద్వారా ఫోటో తీసి జియో ట్యాగింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. జియో ట్యాగింగ్ విధానం పై బుధవారం సాయంత్రం 4 గంటలకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని అన్ని శాఖల అధికారులు తమ కంప్యూటర్ ఆపరేటరును శిక్షణకు పంపించాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు హరితహరంలో నాటిన మొక్కల వివరాలను గ్రామాల వారీగా అందజేయాలని ఆదేశించారు. జియో ట్యాగింగ్ పై ఏమైన ఇబ్బందులు ఉంటే డ్వామా పిడి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా నాటిన మొక్కలు రిజిస్టర్ చేసిన మొక్కలు, జియో ట్యాగింగ్ చేసిన మొక్కల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో అదనపు జెసి ఎ.నాగేంద్ర, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (తూర్పు) రవికిరణ్, డ్వామా పిడి వెంకటేశ్వర్లు, డి.ఆర్.డి.ఎ. పిడి అరుణశ్రీ, హౌజింగ్ పిడి నర్సింహరావు, సిపిఒ సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *