
హైదరాబాద్, ప్రతినిధి : హైదరాబాద్ లోని నాగోల్ ప్రాంతాన్ని ఆదర్శవంతం తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం ఆ నాగోల్ లోని కాలనీల్లో పర్యటించి స్తానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీ రూపురేఖలు మారుస్తానని.. నిరుపేదలకు ఇళ్లు కట్టిస్తానని.. చందాలు వసూలు చేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతానని హామీ ఇచ్చారు. సీఎం స్వయంగా ఒక 1000 రూపాయల నోటు ను తీసి కాలనీ వాసికి అందించి చందాల వసూలును మొదలుపెట్టారు.