
హైదరాబాద్, ప్రతినిధి : మాటీవీలో ప్రసారమవుతున్న ‘కోటీశ్వరుడు’ షోతో హీరో నాగార్జున హవా కొనసాగిస్తున్నాడు. ఐతే, డిసెంబర్ నుండి మొదలైన సెకండ్ సీజన్ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు షో’కి ఫస్ట్‌వీక్ మాదిరిగా ఆశించిన రెస్పాన్స్ రాలేదని తాజా టీఆర్పీ రేటింగ్స్ చెబుతున్నాయి. నిజానికి ఫస్ట్ సీజన్‌కు మించి మంచి రేటింగ్స్ వస్తాయని నిర్వాహకులు భావించినా, ‘కోటీశ్వరుడు’ యావరేజ్ రేటింగ్ 6.6 అని స్మాల్ స్క్రీన్ టాక్.
‘కోటీశ్వరుడు’ 6 ఎపిసోడ్స్ 8.2 నుండి 5.7 మధ్య రేటింగ్స్ పొందాయని తెలిసింది. ఇదే వారం ‘జబర్దస్త్’ ప్రోగ్రాం 2 ఎపిసోడ్స్ 8 రేటింగ్‌తో ఫస్ట్‌ప్లేస్‌లో కంటిన్యూ అవుతోంది. ఎన్టీఆర్ ‘రభస’ సినిమా 14.5 రేటింగ్‌తో ఈవారం అగ్రస్థానంలో నిలిచిందని స్మాల్ స్క్రీన్ టాక్. సీరియల్స్ విషయానికొస్తే.. వరూధిని పరిణయం, మంగమ్మగారి మనవరాలు, చిన్నారి పెళ్ళికూతురు టాప్ రేటింగ్స్‌తో కంటిన్యూ అవుతున్నాయని బుల్లితెర సమాచారం.