Breaking News

నాగర్ కర్నూల్ జిల్లాలో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి

నాగర్ కర్నూల్ జిల్లాలో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి

దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో విద్యాభివృద్ధి

సిఎం కేసిఆర్ విద్యకు అధిక నిధులు ఖర్చు చేస్తున్నారు

నాణ్యమైన విద్యతో పాటు అత్యుత్తమ ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నాం

విద్యార్థుల సంక్షేమం కోసం వసతులు, సౌకర్యాలు కల్పిస్తున్నాం

నాగర్ కర్నూల్ జిల్లాలో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి

నాగర్ కర్నూల్, జనవరి 07 : దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ విద్యాభివృద్ధి చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. విద్య కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ అధిక నిధులు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. నాగర్ కర్నూల్ జిల్లాలో నేడు పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పాల్గొన్నారు.

kadiyam srihari 4

పదర మండలం, రాయలగండి గ్రామంలో 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినిలకు హెల్త్ కిట్స్ పంపిణీచేశారు.
అమ్రాబాద్ జడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పూర్వవిద్యార్థుల సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తర్వాల అచ్చంపేట నగర పంచాయతీ పరిధిలో మిషన్ భగీరథ కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక గతంలో ఎన్నడూ లేనివిధంగా, దేశంలో ఎక్కడా లేనివిధంగా గురుకులాలను ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి పూర్వం316 గురుకులాలుంటే…తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ఈ మూడేళ్లలో ముఖ్యమంత్రి కేసిఆర్ 544 గురుకులాలు ఏర్పాటు చేశారన్నారు.

kadiyam srihari 3

అదేవిధంగా పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త మండలాలు, జిల్లాలు ఏర్పాటుచేసుకున్నందుకు, కొత్త మండలాలకు 84 కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలను తెలంగాణకు తెచ్చుకున్నామని చెప్పారు. ప్రస్తుతం దేశంలో అత్యంత ఎక్కువగా కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే అన్నారు. అంతే కాకుండా కేజీబీవీలలో విద్యార్థులకు మౌలిక వసతుల కోసం 370కోట్ల రూపాయలను ఖర్చు చేశామన్నారు. నాణ్యమైన విద్య అందించడంతో పాటు మంచి పోషకాహారాన్ని కూడా ఇస్తున్నామన్నారు. వారానికి రెండుసార్లు మటన్, నాలుగుసార్లు చికెన్, ప్రతి రోజు గుడ్డు, నెయ్యి ఇస్తున్నామన్నారు. చలికాలంలో స్నానాల కోసం హీట్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటితో పాటు తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్, సీసీ కెమెరాలు, బయో మెట్రిక్ మెషీన్లు, కంప్యూటర్లు, ప్రాక్టికల్ ల్యాబ్స్, స్పోర్ట్స్ మెటీరియల్ అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరే నల్లా ద్వారా మంచినీరు అందించే గొప్ప కార్యక్రమం మిషన్ భగీరథ ఇప్పటికే దేశంలో అందరి ప్రశంసలు పొందుతుందని ఉప ముఖ్యమంత్రి,విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు.

kadiyam srihari 1

ఈరోజు అచ్చంపేటలో 38.50 కోట్లరూపాయలతో చేపట్టే మిషన్ భగీరథ  కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం సంతోషకరమన్నారు. ప్రస్తుతం దేశంలో అత్యంత ఎక్కువగా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న రాష్ట్రంలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. నాగర్ కర్నూల్, అచ్చంపేటలలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలలో మాజీ మంత్రి రాములు, అచ్చంపేట శాసనసభ్యులు గువ్వల బాలరాజు, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.

kadiyam srihari 2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *