నాఖాబందికి సానుకూల స్పందన

కరీంనగర్: కరీంనగర్ కమీషనరేట్ పరిధిలో ఏకకాలంలో నిర్వహించిన నాఖాబంద్ నకు అన్ని వర్గాల ప్రజల వద్దనుండి సానుకూల స్పందన లభించింది. శనివారం రాత్రి 10గం!!ల నుండిఆదివారం తెల్లవారుజాము వరకు కమీషనరేట్ లోని అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలో నాఖాబంద్ ను నిర్వహించి పోలీసులు ఏకకాలంలో తనిఖీలను చేపట్టారు.కమీషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగాయి. పోలీసులు బృందాలుగా ఏర్పడి ప్రధాన కూడళ్ళవద్ద ఏకకాలంలో తనిఖీలు కొనసాగించారు. తనిఖీల సందర్భంగా 33 డ్రంక్ అండ్ డ్త్ర్రెవ్, రెండు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన సంఘటనపై కేసులు నమోదు చేశారు. 23 మోటారు వాహనాల చట్టానికి సంబంధించి కేసులలో 4300రూపాయల జరిమానా విధించారు. సరైన ధృవపత్రాలులేని 30 ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలు, ఒక కారును స్వాధీనం చేసుకొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషపర్ వి.బి.కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ అక్రమ కార్యకలాపాలను నియంత్రించేందుకు ఆకస్మిక తనిఖీలను నిర్వహిస్తున్నామన్నారు. అసాంఘీక శక్తుల కదలికల నియంత్రణ, అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు చేపడుతున్న చర్యలకు ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని తెలిపారు. అక్రమంగా తలదాచుకుంటున్న, అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించి ఎలాంటి కదలికలు ఉన్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సంఘవిద్రోహశక్తులు, అల్లరిమూకలను ప్రజలు చైతన్యంతో ముందుకు వచ్చి నిర్భందించాలని పిలుపునిచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. నాఖాబంది కార్యక్రమంలో ఎసిపిలు
జె.రామారావు, యం.రవీందర్ రెడ్డి, సి. ప్రభాకర్, ఇన్స్ పెక్టర్లు హరిప్రసాద్, సదానందం, కృష్ణగౌడ్, శ్రీనివాసరెడ్డి, రమణమూర్తి, గౌస్ బాబా, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ లతో పాటుగా 30మంది ఎస్.ఐ.లు వివిధ విభాగాలకు చెందిన 500 మంది పోలీసులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.