
‘నా చిన్నప్పుడు చైన్నైలో చదివా.. అప్పుడు స్కూల్ డేస్ ఫ్రెండ్స్ ఉండేవారు.. ఇప్పుడు వారంతా చైన్నైలోనే ఉన్నారు. ఆ రిలేషన్ షిప్ అక్కడే కట్ అయిపోయింది.. ఇప్పుడు నాకు స్నేహితులు ఎవరూ లేరు ’ అన్నారు సూపర్ స్టార్ మహేశ్ బాబు.. శ్రీమంతుడు రిలీజ్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు..
నాకు స్నేహితులు ఎవరూ లేరని.. స్నేహితుల దినోత్సవం పెద్దగా జరుపుకోనన్నారు. నాతో సినిమా చేసిన ప్రతీ దర్శకుడిని స్నేహితుడిగా భావించి వారితో స్నేహంగా ఉంటానని తెలిపారు.
అల్లూరి సీతారామారాజు మూవీ సినీ చరిత్రలో బైబిల్ లాంటిదని.. అలాంటి మూవీని తీసి చెడగొట్టనని తెలిపారు.మంచి కథలతో వస్తే పీకే, భజరంగీ లాంటి సినిమాలు చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దర్శకుడు కొరటాల శివ, చిత్రనిర్మాతలు పాల్గొన్నారు.