
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా ప్రారంభమయ్యాయి. సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్ బడ్జెట్ మాట్లాడేందుకు స్పీకర్ టైం ఇవ్వడం లేదని.. వైసీపీ పార్టీకి కనీసం రెండున్నర గంటల సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ స్పీకర్ దాన్ని తోసి పుచ్చారు. అజెండాలో చాలా ముఖ్యమైన అంశాలున్నాయని.. అన్నింటిపై చర్చ జరగాలని ఒకేదానిపై రెండు గంటలు సాధ్యంకాదని తేల్చిచెప్పారు. కానీ ప్రతిపక్ష నేత జగన్ దీన్ని ఏకభవించలేదు.ఖచ్చితం గా ప్రజావాణిని వినిపించేందుకు తమకు రెండున్నర గంటలు సమయం ఇవ్వాలని భీష్మించారు. దీంతో సభలో రగడ మొదలైంది. బడ్జెట్ పై, రాజధాని విషయం, ప్రజాసమస్యలపై తాము మాట్లాడుతామని చెప్పారు.