
నేను సినిమాల్లోకి రాకముందే గోపీచంద్ హీరోగా కొనసాగుతున్నాడని హీరో ప్రభాస్ అన్నారు. గోపిచంద్ హీరోగా నటించిన జిల్ ఆడియో వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గోపీ నేను మంచి ఫ్రెండ్స్ అని చెప్పాడు. రాశీ ఖాన్నా హీరోయిన్ గా రాధకృష్ణ దర్శకత్వంలో సినిమా రూపొందుతుంది. యూవీ క్రియేషన్స్ పథకంపై సినిమా రూపొందుతుంది.
కాగా నా కొత్త లుక్ కారణం ప్రభాస్ అన్నారు హీరో గోపిచంద్. ముంబై నుంచి హెయిర్ స్టైలిష్ ను పిలిపించి నా లుక్ మార్చేశారు. అందుకు ప్రభాస్ కు, దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు.. అన్నారు. జిల్ ఆడియో లాంచ్ వీడియో మీ కోసం..