నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఉబ్బస వ్యాధి బాధితులకు చేపమందు పంపిణీ

మృగశిర కార్తె ప్రారంభం రోజు శుక్రువారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నందు ఉబ్బస వ్యాధి బాధితులకు ఉపశమనం కలిగించే చేపమందు పంపిణీని శాసన  మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, రాష్ట్ర్ర పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్ర్రమల అభివృద్ధి, సినిమాటోగ్ర్రఫీ శాఖట మంత్రి శ్రీ తలసాని శ్రీనివాసయాదవ్ ప్రారంభించారు. మొదటిగా మంత్రికి, ఛైర్మన్ కు బత్తిన హరినాధ గౌడ్ సోదరులు చేపమందు ప్రసాదాన్ని వేసారు. తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్ర్రాల నుండి ప్రజలు భారీ ఎత్తున ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు తరలి వచ్చారు. 6వ తేది నుండే ఇక్కడకు చేరుకున్న ప్రజల సౌకర్యార్ధం రాష్ట్ర్ర ప్రభుత్వం అన్ని మౌళిక సదుపాయాలను  కల్పించినట్లు వారు తెలిపారు. 1 లక్ష 30 వేల చేప పిల్లలను మత్స్య శాఖ సరఫరా చేసినట్లు తెలిపారు. జిహెచ్ఎంసి, ఆర్ ఎండ్ బి, విద్యుత్తు, జలమండలి, పోలీస్, రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ, ఆర్టిసీ, ఫైర్ సర్వీస్, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో పని చేస్తూ ప్రజల ఆదరణ చూరగొన్నట్లు తెలిపారు. 5 తరాల  నుండి బత్తిన సోదరులు తయారు చేస్తున్న చేప మందు ప్రసాదానికి చాలా గుర్తింపు ఉన్నదని చెప్పారు. ప్రాచీన భారతీయ వైద్య విధానాన్ని పరిరక్షించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక శ్ర్రద్ద తీసుకుంటున్నట్లు తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేప మందు ప్రసాదానికై వివిధ రాష్ట్ర్రాల నుండి వచ్చిన ప్రజలతో మాట్లాడారు. ప్రభుత్వం కల్పించిన సదుపాయాల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తపరిచారు. ప్రజల సౌకర్యార్ధం స్వచ్ఛంధ సంస్ధలు విశిష్ఠమైన సేవలు అందించినట్లు మంత్రి తెలిపారు. అగర్ వాల్ సేవా సమితి, పంజాబి సేవా సమితి, జైస్వాల్ సేవా సమితి వారు ఉచితంగా ఏర్పాటు చేసిన అన్నదానం కౌంటర్లను సందర్శించి ప్రజలకు భోజనాన్ని వడ్డించారు. అన్ని కౌంటర్లను క్యూలైన్టను  మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ చంద్రకళ, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

talasani srinivasa yadave 1     talasani srinivasa yadave 2    talasani srinivasa yadave 3    talasani srinivasa yadave 4      rdo chandrakala     talasani srinivasa yadave 5    talasani srinivasa yadave 6   nampally ground    nampally ground 1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *