
నవ తెలంగాణ దినపత్రిక ను ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారంనాడు రవీంద్ర భారతిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రెండు, మూడు రోజుల్లో జర్నలిన్టులకు అక్రిడిటేషన్లు జారీ చేస్తామన్నారు. పత్రికలు సమాజంలోని చీకటి కోణాలను బయటకు తీయాలన్నారు. తెలంగాణ ఉనికి కాపాడుకునేందుకు పత్రికలు పాటుపడాలని కేసీఆర్
కోరారు. నవ తెలంగాణ పత్రికకు తమ పూర్తి సహకారం ఉంటుందన్నారు. నవ తెలంగాణ పత్రిక ప్రజల చేతిలో ఆయుధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో తమ్మినేని వీరభద్రం, ఉత్తమ్ కుమార్ రెడ్డి, చాడ వెంకట్ రెడ్డి, ఎల్. రమణ, అల్లం నారాయణ, వీరయ్య తదితరులు పాల్గోన్నారు.