నవ్వలేక పోవడం రోగమా..?

హైదరాబాద్, ప్రతినిధి :
‘నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వలేకపోవడం ఒక రోగం’ అన్నాడు ఒక కవి.. అందుకే ప్రతీ గురువారం జబర్దస్త్ ను విరగబడి చూస్తున్నాం.. నవ్వు‘కొంటు’న్నాం..  వారాల తరబడి అదే కామెడీ.. అవే పార్టిసిపెంట్లు..  కొత్తగా చేయలేకపోతున్నారు.. కానీ అంత ఇంతో నవ్వుతున్నాం కాబట్టే ఆ షో ఇప్పుడు తెలుగులో నంబర్ వన్ గా వెలుగొందుతోంది..

కాలంతో పోటీపడి మనుషులు పరుగెత్తుతున్న ఈ కాలంలో అసలు నవ్వులు జీవితంలో లేకుండా పోయాయి.  ఎప్పడో పొద్దున సద్దికట్టి ఇంటినుంచి బయలుదేరితే.. ట్రాఫిక్ కష్టాలు అధిగమించి.. ఆఫీసులో బండ చాకిరీ చేసి జీవితం నిస్సారంగా గడిపే వారెందరో.. ఇక వారి జీవితంలో నవ్వు లేకుండా పోతోంది. వీకెండ్ లలో సినిమాలు.. లేదా టీవీలో షోలు చూస్తాం.. పిల్లలతో ఆడుకునే టైం కూడా ఉండడం లేదు. వారి ప్రపంచం వారిది. స్కూలు నుంచి రావడంపోవడానికే సమయం పోతోంది.. ఇక వారు కనీసం ఆటలు ఆడడానికి కూడా సమయం చిక్కడం లేదు. ఇక తల్లిదండ్రులతో ఎప్పుడు గడిపేది.?

ఇన్ని సమస్యల మధ్య నవ్వుల చిందే దెప్పడు? పెద్ద కుటుంబాలు విచ్ఛిన్నం అయి చిన్న కుటుంబాలు పెరిగాయి.. సంపాదన పరుగులు సమయం లేని జీవితాలతో సంతో షం ఆవిరైంది. సాఫ్ట్ వేర్ జాబుల్లో లక్షల జీతం వస్తున్నా.. వారిలో ఒత్తిడి పెరిగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. శని, ఆదివారాల్లో తాగడమే పని అయిపోయింది. ఇక ఎపైర్ లు , ప్రేమలతో సగం యువత నవ్వడం మానేశారు. కాలేజల్లో కొంత సందడి నవ్వులు కనపడుతున్నాయి..

అసలు ప్రశాంతంగా నవ్వే వాళ్లు ఒక్కరూ లేరా? అని ప్రశ్నించకుంటే.. ఉన్నరు.. కల్మశం లేకుండా ప్రశాంతంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా నవ్వేవారు ‘చిన్న పిల్లలు’   వారి పాల బుగ్గల నవ్వుల ఆస్వాదించడం మనకు ప్రశాంతత నిస్తుంది. వారి నవ్వులను చూసైనా బిజీ బాబులు కాస్తంతా నవ్వడం.. సేదతీరడం చేయండి.. రోజూ కొద్ది సేపు నవ్వితే జీవితకాలం పెరుగుతుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. సో నవ్వండి బాగా నవ్వండి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.