
సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనరుగా పనిచేసిన కాలం తనకు
సంతృప్తిని ఇచ్చిందని, కళాశాల విద్య , సాంకేతిక విద్యా
శాఖ కమిషనరు నవీన్ మిట్టల్ అన్నారు. సమాచార పౌర
సంబంధాల శాఖ కమిషనరుగా పనిచేసి కళాశాల విద్య ,
సాంకేతిక విద్యా శాఖకు బదిలీపై వెళ్ళిన ఆయనను సోమవారం
సమాచార శాఖ అధికారులు, సిబ్బంది మాసాబ్ ట్యాంక్ లోని
సమాచారభవన్ లో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాచార శాఖ సిబ్బంది
సంపూర్ణ సహకారం వలననే తను కమీషనరుగా ప్రభుత్వ అభివృద్ధి,
సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా ప్రజల్లోకి తీసుకు
వెళ్ళగలిగానని అన్నారు, ఈ శాఖ చాలా కీలకమైనదని, అన్ని శాఖలకు
సంబంధం కలిగి ఉందని అన్నారు. నేను కమిషనరుగా బాధ్యతలను
స్వీకరించినపుడు ఇక్కడి అధికారులు, సిబ్బంది ఆంధ్రప్రదేశ్
సమాచార శాఖతో పోల్చి, తమకు తక్కువ సౌకర్యాలు ఉన్నాయని
అనేవారు, కానీ ఇపుడు తెలంగాణా సమాచార శాఖ పనితీరుతో
ఆంధ్రప్రదేశ్ అధికారులు పోల్చుకుంటున్నారని అన్నారు.
సమాచార శాఖలో మెరుగైన మౌలిక సదుపాయాలు, ఆధునిక సాంకేతిక
పరిజ్ఞానాన్ని సమకూర్చడం వలన సిబ్బంది పనితీరు మెరుగు
పడిందని అన్నారు. నవంబర్, 2015 నుండి ఈ శాఖలో పనిచేశానని,
సిబ్బంది సమిష్టి కృషితో ఇది సాధ్యమైందని అన్నారు. ఫిల్మ్
డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మెన్, సిబ్బంది సహకారంతో
గత నవంబర్ లో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలను ఘనంగా
నిర్వహించగలిగామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఫిల్మ్ డెవలప్ మెంట్ చైర్మెన్
శ్రీ రాo మోహన్ రావు, సమాచార శాఖ అదనపు సంచాలకులు శ్రీ కె.
నాగయ్య, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ శ్రీ కిషోర్ బాబు,
అధికారులు, సిబ్బంది, ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్
సిబ్బంది పాల్గొన్నారు.