నవంబర్ 21న వరంగల్ ఉపఎన్నికలు

హైదరాబాద్ (పిఎఫ్ ప్రతినిధి): వరంగల్ ఉపఎన్నికలకు సంబంధించి వివరాలను ఎన్నికల అధికారి భన్వర్ లాల్ మీడియాకు తెలిపారు. ఈనెలాఖరుకు ఎన్నికల పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. ఈ నెల 25 వరకు ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. వరంగల్ జిల్లాలో ఇప్పటివరకు 14,75,311 లక్షల ఓటర్లు నమోదయ్యారని, 96,846 మంది ఓటర్లను తొలగించడం జరిగిందని, 33,222 వేల మంది కొత్తగా ఓటరుగా నమోదయ్యారని తెలిపారు. నవంబర్ 21న పోలింగ్ నిర్వహిస్తారని, 24న కౌంటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నవంబర్ 5వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నట్లు తెలిపారు. వెబ్ కాస్టింగ్ ద్వరా ఎన్నికల సరళిని పరిశీలించనున్నట్లు తెలిపారు. ఈవీఎంలపై అభ్యర్థుల ఫోటోలను ముద్రించనున్నట్లు తెలిపారు. రూ. 70 లక్షలకు మించి ఖర్చు చేస్తే అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. నారాయణ ఖేడ్ ఉపఎన్నికలకు ఇంకా సమయం ఉన్నట్లు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *