నల్లకుబేరులు లక్షకుపైగానే..

లక్ష మంది.. ఆక్షరాల 6 లక్షల కోట్లకు పైగానే నల్లధనం.. నల్లకుబేరుల జాబితాను అంతర్జాతీయ పరిశోధనాత్మక పాత్రికేయుల వేదిక బయటపెట్టింది. ప్రపంచాన్ని కుదేపిస్తున్న ఈ జాబాతాలో భారత్ కు చెందిన ప్రముఖ భారతీయులు, రాజకీయ నాయకులు, కాంగ్రెస్ లీడర్లు, మాజీ అధికారుల పేర్లు ఉండడంతో దుమారాన్ని రేపుతోంది.

స్విట్జర్లాండ్ లోని హెఎస్ బీసీ బ్యాంకులో ఉన్న ఈ ఖాతాల వివరాలను కొందరు అంతర్జాతీయ పాత్రికేయులు సీక్రెట్ గా సంపాదించారు. ఈ వివరాలు బయటపడడంతో అక్రమార్కుల్లో దడదడ మొదలైంది. దీనిపై కేంద్రం కూడా సంప్రదించింది.

ఈ జాబితాలో 1195 మంది భారతీయుల పేర్లు ఉన్నాయి. ప్రస్తుత విదేశీ మారక విలువల ఆధారంగా లెక్కిస్తే ఆ ఖాతాల్లోని నిల్వలు 400 కోట్ల డాలర్ల (రూ.25,420కోట్లు ) పైగా ఉంటాయి. ఈ జాబితాలోని సగం పేర్లు సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వద్ద ఉన్నాయి. ఈ నల్లకుబేరుల జాబితాలోని వ్యక్తుల నుంచి బకాయిల వసూలుకు ఇప్పటికే అధికారులు చర్యలు చేపట్టారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *