నలబై వేల ట్రీ గార్డులను జి.హెచ్.ఎం.సి. కి అందజేసిన వి.ఎస్.టి.: హరితహారం విజయవంతం చేసేందుకు 1.30 కోట్ల వ్యయం

హైదరాబాద్ లోని ప్రముఖ వజీర్ సుల్తాన టుబాకో (వి.ఎస్.టి.) కంపెనీ హరితహారంలో బాగంగా 1.30 కోట్ల రూపాయలను వ్యయం చేసి ట్రీ గార్డులను జి.హెచ్.ఎం.సి. కి గురువారం నాడు అందజేసింది.రాష్ట్ర హోం మరియు కార్మిక శాఖ మంత్రి నాయిని నరసింహ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో హైదరాబాదు నగర మేయర్ బొంతు రాంమోహన్, జి.హెచ్ .ఎం.సి అధికారిణి హరిచందన , జి.హెచ్ .ఎం.సి స్టాండింగ్ కమిటి సబ్యుడు మరియు వి.ఎస్.టి కంపనీ యునియన్ అధ్యక్షుడు వి.శ్రీనివాస్ రెడ్డి లు ప్రసంగించారు.వి.ఎస్.టి ఎం.డి. దేవరాజ్ లేహరి దాదాపు 1.30 కోట్ల రూపాయల విలువ గల 40 వేల ట్రీ గార్డులను ఈ సందర్భంగా జి.హెచ్ .ఎం.సి మేయర్ కు అందజేసారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం “హరిత హారం” కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, దీనికి సహకరించేందుకు వి.ఎస్.టి కంపనీ ముందుకు రావడం అభినందించదగినదన్నారు. కార్పోరేట్ సామజిక భాద్యత (సి.ఎస్.ఆర్ ) లో భాగంగా భారీ స్థాయిలో ట్రీ గార్డు లను అందచేయడం వల్ల జి.హెచ్.ఎం.సి కి అవసరమైన 80 శాతం ట్రీ గార్డులను సమకూర్చినట్లిందన్నారు. వి.ఎస్.టి కంపెనీతో నాకు 20 సంవత్సరాల అనుభందముందని ,యునియన్ అధ్యక్షుడిగా పనిచేశానన్నారు. సామజిక కార్యక్రమాలలో భాగంగా అంగన్వాడి కేంద్రాలకు ఫర్నిచర్లను, టాయ్లెట్లను , వి.ఎస్.టి నిర్మించినదని అన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ వివిధ రాష్ట్రాల దృష్టి ని ఆకర్షిస్తున్న నేపథ్యంలో “హరిత హారం “ కార్యక్రమానికి అన్ని కార్పొరేట్ సంస్థలు తమ వంతు సహకారాన్ని అందించాలని మంత్రి కోరారు. మేయర్ బొంతు రాంమోహన్ మాట్లాడుతూ సామాజిక కార్యక్రమాలలో భాగంగా వి.ఎస్.టి కంపెనీ ఇతర కంపెనీ లకు ఆధర్శంగా నిలిచిందన్నారు. స్థలం కేటాయిస్తే అన్నపూర్ణ క్యాంటిన్ ను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేస్తామన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం నలభై కోట్ల మొక్కలని నాటెందుకు ప్రయత్నిస్తున్దన్నారు. జి.హెచ్ .ఎం.సి అధికారి హరిచందన వి.ఎస్.టి ప్రయత్నాన్ని కొనియాడారు. జి.హెచ్ .ఎం.సి స్టాండింగ్ కమిటి సభ్యుడు వి.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తాను వి.ఎస్.టి యునియన్ అద్యక్షుడిగా ఉన్న సమయం లో 1.30 కోట్ల రూపాయల వ్యయం తో ట్రీ గార్డు లను పంపిణీ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు . వి.ఎస్.టి యునియన్ ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి , ముఠా గోపాల్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

bonthu ramohan 1     bonthu ramohan 2    bonthu ramohan 3

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.