నర్సరీల పెంపకాన్ని వేగవంతం చేయాలి : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరిత హారం పథకానికి సంబంధించిన అవసరమైన నర్సరీల పెంపకాన్ని వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.పి.సింగ్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
బుధవారం సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే నాటిన మొక్కలను సంరక్షించి వచ్చే సంవత్సరానికి, హరిత హారం విజయవంతంగా నిర్వహించడానికి సూక్ష్మ ప్రణాళికను సిద్దం చేయాలని అన్నారు. జిల్లాలోని సీనియర్ అధికారులను నియమించి ఈ ప్రణాళికను రూపొందించాలని అన్నారు. గ్రామాలలో హరిత రక్షణ కమిటీల ద్వారా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు నర్సరీలు సందర్శించి సమీక్షించాలని తెలిపారు. చేనేత కార్మికులకు సంబంధించి ప్రస్తుతం ఆ వృత్తిలో కొనసాగుతున్న కార్మికుల వివరాలను గ్రామాల వారిగా సేకరించి , చేతి మగ్గాల పరిస్థితిని తెలుసు కోవడానికి ప్రత్యేక బృందాలతో సర్వే చేయించాలని అన్నారు. 14 అంశాలతో ప్రోఫార్మ పంపించడం జరిగిందని అన్నారు. మార్చి 5 వ తేదిలోగా నివేదికను ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. ప్రతి మగ్గానికి జియో ట్యాగింగ్ చేయించనునన్నట్లు తెలిపారు. బలహీన వర్గాల ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే పురోగతిని సాధించామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారు ఈ అంశాన్ని కలెక్టర్ల సమావేశం లో ప్రత్యేకంగా సమీక్షించాలని తెలుపుతూ గృహ నిర్మాణాలకు అవసరమైన ల్యాండ్ బ్యాంక్ సిద్ధం చేయాలని తెలిపారు. 2015-2016 సంవత్సరానికి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి 1000 ఇండ్లను మంజూరు చేసినందున వాటికి అవసరమైన ల్యాండ్ బ్యాంక్ ను సిద్ధం చేసి 25 ఫిబ్రవరి లోపల సమర్పించాలని ఆదేశించారు. I.Y.A క్రింద చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.
గృహ నిర్మాణానికి సంబంధించి ఐ.టి. ఆధారిత సాప్ట్ వేర్ ను అభివృద్ధి చేసి , ఆన్ లైన్ పద్దతిలో చెల్లింపుల గురించి ఎస్.ఇ. , ఇ.ఇ.ల కు త్వరలో వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరించారు. టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు.
బీడి కార్మికులకు సంబంధించి గతంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేసిన వివరాలు , డబుల్ బెడ్ రూమ్ గృహాలకు సంబంధించిన వివరాలను ఫిబ్రవరి 25 తేది లోగా సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు.
ఇతర రాష్ట్రాలలో అందుబాటులో ఉన్న గొర్రెల యూనిట్ లకు సంబంధించి జిల్లాలు , మండలాలు , గ్రామాల వారీగా అందుబాటులో ఉన్న వివరాలు , డిమాండ్ సర్వే ఈ నెల 27 లోగా సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలెక్టర్లను కోరారు. గొర్రెల అవసరాల డిమాండ్ అంచనాలతో పాటు , సరఫరా అంచ నాను కూడా వేయాలని అన్నారు. కొత్త సోసై టీల ఏర్పాటును వేగవంతం చేయాలన్నారు.
సాదా బైనామాల రెగ్యులరైజేషన్ కు సంబంధించి చర్యలను వేగవంతం చేయాలన్నారు. అసైన్డ్ భూములకు సంబంధించి 17 జిల్లాల కలెక్టర్లు డాటా అఫ్ లోడ్ చేసినందుకు కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అభినందించారు. మీగత జిల్లాల కలెక్టర్లు కూడా ఈ విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
షాదీ ముబారక్ , కళ్యాణ లక్ష్మి పథకాలకు సంబంధించి ఆర్.డి.వోలతో ప్రత్యేకంగా సమీక్షించి దరఖాస్తుల వెరిఫికేషన్ ను వేగవంతం చేసి లబ్ధిదారులకు డబ్బులు అందేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

అత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులు పెండింగ్ లో లేకుండా చూడడంతో పాటు అవసరమైన నిధుల వివరాలను సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లను కొరారు.
మిషన్ భగీరథ కు సంబంధించి ట్రంక్ వర్క్స్ పనులతో పాటు , ఇంట్రా విలేజ్ పనులు వేగవంతం చేయాలని అన్నారు. గ్రామాలలో ఇంట్రా విలేజ్ పనులకు సంబంధించి ప్రజలను చైతన్యవంతులను చేయడం తో పాటు కలెక్టర్ల డి.పి.ఓ లను డి.ఆర్.డి.ఓ లను పాల్గొనేలా చూడాలన్నారు. ఓవర్ హెడ్ స్టోరేజ్ రిజ్వాయర్ కు అవసరమైన స్థలం గురించి రెవెన్యూ అధికారులను ఇన్ వాల్వ్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.పి.సింగ్ జిల్లా కలెక్టర్లను కోరారు.
బి.సి. మరియు మైనార్టీల కు సంబంధించి రెసిడెన్సియల్ పాఠశాలలు ప్రతి నియోజకవర్గంలోమంజూరు చేసినట్లు తెలిపారు. ఆ పాఠశాలలు వచ్చే విద్యా సంవత్సరం నుండి విద్యార్థులను చేర్చుకోనున్నట్లు తెలిపారు. కలెక్టర్లు వెంటనే భవనాలను గుర్తించి నివేదిక పంపాలని ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు శ్రీ సురేష్ చందా, శ్రీ బి.ఆర్. మీనా, శ్రీమతి చిత్రారామచంద్రన్ , శ్రీ అజయ్ మిశ్రా, ముఖ్యకార్యదర్శులు శ్రీ జయేశ్ రంజన్ , శ్రీ అశోక్ కుమార్ , కార్యదర్శి శ్రీ ఓమర్ జలీల్ , కమీషనర్లు శ్రీమతి నీతూకుమారి ప్రసాద్ , శ్రీమతి శైలజా రామఅయ్యర్ , పి.సి.సి.ఎ.ఫ్ శ్రీ పి.కె.ఝా తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *