నరేంద్రమోడీకి సుప్రీం వాత..

కొలీజియం వ్యవస్థ.. సుప్రీం కోర్టుకు న్యాయమూర్తులను, హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను  నియమించే వ్యవస్థ.. 99వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ కొలీజియం వ్యవస్థ ఏర్పడింది. ఈ వ్యవస్థలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బృందం సిఫారసుల ద్వారా రాష్ట్రపతి న్యాయమూర్తులను నియమిస్తారు.  కానీ ప్రధాని మోడీ పగ్గాలు చేపట్టాక ఈ విధానాన్ని మార్చాలని ప్రయత్నించారు. కొలీజియం రద్దు చేసి కేంద్ర ప్రభుత్వమే నియామకాలు చేపట్టేలా పార్లమెంటులో బిల్లు పెట్టారు. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం లేసింది..

ప్రధాన న్యాయమూర్తులను, హైకోర్టు న్యాయమూర్తులను నియమించే అధికారం కేంద్రానికి కట్టబెడితే న్యాయవ్యవస్థ అభాసుపాలవుతుందని.. న్యాయాన్యాయాలు భ్రష్టుపట్టి కేంద్ర ఆదేశాల మేరకు పనిచేస్తాయని విమర్శలు వ్యక్తం అయ్యాయి..

కాగా దీనిపై సుప్రీం కోర్టు సుధీర్ఘ మంతనాలు జరిపింది.. పార్లమెంటుకు న్యాయమూర్తులను నియమించే అధికారం లేదని.. సుప్రీంకోర్టే నియామకాలు చేస్తుందని ఈరోజు తీర్పు చెప్పింది.. కొలీజియం ఎన్ జేఏసీ చట్టానికి రాజ్యాంగ బద్ధత లేదని తీర్పునిచ్చింది.. ఈ సంచలన తీర్పుతో బీజేపీ నరేంద్రమోడీ ప్రభుత్వానికి దిమ్మతిరిగింది..న్యాయవ్యవస్థను నియంత్రించాలన్న బీజేపీ ప్రభుత్వ ఆశలు అడియాసలయ్యాయి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *