నరాలు తెగిపోయే ఉత్కంఠ

శుక్రవారం జరిగిన ఐసీసీ టీ ట్వంటీ మ్యాచ్ లు రెండూ నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగి వీక్షకులకు వినోదాన్ని పంచాయి.. మొదట జరిగిన  ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మ్యాచ్ కానీ.. ఆ తరువాత రాత్రి జరిగిన ఇంగ్లాండ్-సౌతాఫ్రికాల మ్యాచ్ కానీ బంతికి బంతికి ఉత్కంఠ రేపి అభిమానులను ఊర్రూత లూగించాయి..

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో మొదట న్యూజిలాండ్ 20 ఓవర్లలో 142/8 పరుగులు చేసింది. అనంతరం 143 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 134/9 పరుగులే చేసి ఓడిపోయింది.
అనంతరం మరో మ్యాచ్ లో ఇంగ్లాండ్-సౌతాఫ్రికా విజయమే లక్ష్యంగా కొదమ సింహాల్లా తలపడ్డాయి. మొదటి దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 229/4 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 230 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఎక్కడా తగ్గకుండా ఆడింది. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ జో రూట్ 44 బంతుల్లోనే 83 పరుగులు చేసి ఒంటిచేత్తో ఇంగ్లాండ్ ను గెలిపించాడు. రోయ్ 16 బంతుల్లో 43 పరుగులు చేసి గెలుపులో భాగస్వాములయ్యాడు.

మొత్తానికి ఈరోజు జరిగిన రెండు మ్యాచ్ లు రెండు హైలేట్ అని చెప్పాలి.

About The Author

Related posts