నరాలు తెగిపోతున్నాయి..

Bihar-Assembly-Elections-02015

బీహార్ ఎన్నికల ఫలితాలు ఆదివారం (రేపు) విడుదలకానున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. రేపటి 11 గంటలలోగా ఎన్నికల ఫలితాలు తేలి బేజేపీ నా, లేక నితీష్ మహా కూటమినా అనేది తేలనుంది. విజయం ఎవరిని వరిస్తుందో.. ఓటమి ఎవరిదో అన్న అంశం ఇప్పుడు బీహార్ లో నరాలు తెగే ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

జేడీయూ నేత, సీఎం నితీష్ కుమార్ కు కొన్ని సర్వేలు అనుకూలంగా ఇచ్చాయి.. దేశ వ్యాప్తంగా జాతీయ చానల్స్ నిర్వహించిన అన్ని ఎగ్జిట్ పోల్స్ లో బీహార్ లో బీజేపీ, మహాకూటమి సరిసమానంగా సీట్లు సాధించినట్టు నిగ్గుతేల్చాయి. దీంతో ఎవరు గెలుస్తారో.. ఎవరు ఓడతారోనన్న ఉత్కంఠ రాజ్యమేలుతోంది..

కాగా బీహార్ సీఎం నితీష్ మీడియా, పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉన్నారు. ఆయన ఇంట్లో సైలెంట్ మేంటేన్ చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారం కాగానే ఇలా అజ్ఞాతంలోకి వెళ్లడం ఆయనకు ఆనవాయితీగా వస్తోంది.. ఇక లాలూ బాగా హడావుడి చేస్తున్నాడట..

అలాగే బీహార్ బీజేపీ అధ్యక్షుడు సుశీల్ కుమార్ మోడీ కూడా గెలుపుపై దీమాతో ఉన్నారు. ఒకరిద్దరు నాయకులతో పోలింగ్ సరళిని అంచనావేస్తున్నారట. బీహార్ లో బీజేపీ గెలిస్తే ఈయనే సీఎం అనే టాక్ వినపడుతోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *