Breaking News

నరకానికి నకలుగా నల్లబెల్లి రోడ్డు

nallabelli-warangal-parakal

వరంగల్ , ప్రతినిధి : అదీ మూరుమూల ప్రాంతం కాదు.. తెలంగాణలోనే రెండో అతిపెద్ద నగరం వరంగల్ కు కూత వేటు దూరంలో ఉంది. రోడ్డు రవాణా లేని ప్రాంతం కాదు.. మంచి రవాణా సౌకర్యాలు.. నక్సలైట్ల ప్రాంతం అంతకంటే కాదు.. కేవలం వరంగల్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని సంగెం మండలం నల్లబెల్లి ప్రాంతం.. ఆ ప్రాంతానికి ఏమైందని అనుకుంటున్నారా..?

మచ్చాపూర్ నుంచి నల్లబెల్లి రోడ్డు నరకానికి నకలుగా మారింది.. ఈ రోడ్డు గుండా పోవాలంటే బాడీలోని పాట్లను టైట్ గా బిగించుకోవాల్సిందే.. లేకపోతే మీరు ఆస్పత్రి పాలు కాక తప్పదు.. మచ్చాపూర్ -నల్లబెల్లి రోడ్డు గుంతలు, గోతులతో కనీసం నడిచేందుకు కూడా వీలులేకుండా ఉంది. ఇక వాహనాల ప్రయాణం అంటే మీరు పెద్ద సాహసం చేయాల్సిందే..

వరంగల్ నుంచి కూతవేటు దూరంలోని ఈ ప్రాంతం పరకాల నియోజకవర్గం పరిధిలో ఉంది. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి (టీఆర్ఎస్) నేతృత్వం వహిస్తున్నారు. కోట్ల నిధులు రోడ్ల కోసం కుమ్మరిస్తున్నామన్న పాలకుల మాటలు ఇక్కడ నీటి మూటలే అవుతున్నాయి. ఎక్కడా రోడ్ల అభివృద్ధి కనిపించడంలేదు. గర్భిణులు, వృద్ధులు ఈ రోడ్డు గుండా వెళితే వారి ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సిందే.. ఏదైన ఎమర్జెన్సీ ఉంటే ఈ రోడ్డు గుండా వెళ్లేందుకు కూడా వీలులేదు. అధికార పార్టీ నేతలు ఇకనైన నల్లబెల్లి రోడ్డుకు మోక్షం కలిగించి ప్రజలు బాధలు తీర్చాలని ప్రయాణికులు కోరుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *