నయీమ్ తో పోలీసులకు లింకులు

గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. పోలీసుల అండదండలతో తన నేర సామ్రాజ్యాన్ని నడిపిన నయీమ్ తో…పోలీసులకు ఉన్నలింకులు బయటపడ్డాయి. తనకు తాను సేఫ్ జోన్ లో ఉండేందుకు నయీమ్ తీసుకున్న సీక్రెట్ ఫోటోలు ఇప్పుడు పోలీస్ డిపార్ట్ మెంట్ లో కలకలంరేపాయి. గ్యాంగ్ స్టర్ నయీమ్ తో దోస్తాని చేసిన పోలీసుల చిట్టా బయటపడుతోంది. నయీమ్ తో కలిసి పార్టీలు, విందులు వినోదాల్లో పాల్గొన్న పోలీస్ అధికారుల ఫోటోలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. నయీమ్ తన నేర సామ్రాజ్యంలో భువనగిరి,నల్లగొండతో పాటు సిటీ శివారు ప్రాంతాల్లో పోలీసులతో కలిసి సెటిల్మెంట్లు చేసాడని ఇప్పటికే అనేక ఆరోపణలున్న నేపధ్యంలో…తాజాగా బయటపడ్డ ఫోటోలు డిపార్ట్ మెంట్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఐతే ఈ ఫోటోలు అన్నీ నయీమ్ తాను కోవర్టుగా ఉన్నప్పుడు పోలీసులతో కలిసిన సమయంలో సీక్రెట్ గా తీసిన ఫోటోలుగా అనుమానిస్తున్నారు పోలీస్ బాసులు. నయిమ్ కేసుల్లో ఇప్పటి వరకు 166కు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 109 మందిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుల్లో అరెస్ట్ అయిన వారిలో ప్రభుత్వ అధికారుల నుంచి లోకల్ గా ఉండే రియల్టర్లు ఉన్నారు. ఈ మొత్తం కేసుల్లో 92 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని స్టేట్ మెంట్స్ రికార్డు చేశారు. దీంతో పాటు నయీమ్ బారినపడి ఆస్తులు భూములు కోల్పోయిన 418 మందిని సాక్షులను విచారించి వారి స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు. భువనగిరి కేంద్రంగా సాగిన నయీమ్ నేరసామ్రాజ్యం ఎల్బీనగర్,కరీంనగర్, జనగాం,కోరుట్లతో పాటు జగిత్యాల, నల్లగొండ, మెదక్ లలో పోలీసుల సనుసన్నల్లోనే సెటిల్మెంట్లకు పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. ఐతే ఇలాంటి ఆరోపణలపై ఇప్పటికే హైకోర్టుకు నివేధిక అందించిన హోంశాఖ….ఇంటలిజెన్స్ డ్యూటీలో కాకుండా నయీమ్ తో కలిసి అక్రమాలకు పాల్పడ్డ పోలీస్ లపై ఇంటర్నల్ దర్యాప్తు చేస్తున్నారు.ఐతే డిపార్ట్ మెంట్ నుండి తనను తాను కాపాడుకోవడానికి పక్కా ప్లాన్ తో నయీమ్ తీసుకున్న ఫోటోలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతుండడంతో…పోలీస్ డిపార్ట్ మెంట్ లో మరో సారి కలవరం మొదలైంది. ప్రస్తుతం డీఎస్పీ హోదాలో ఉన్న మద్దిపాటి శ్రీనివాసరావు నయీంతో చర్చలు జరుపుతున్న ఫోటోలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. వాళ్లిద్దరూ కలిసి ఓ రెస్టారెంటులో భోజనం చేస్తున్నట్లుగా ఉన్న ఫొటో బయటకు వచ్చింది. ఆయన గతంలో కీలకమైన విభాగాల్లో ఎస్ఐ స్థాయి నుంచి పనిచేశారు. నయీంతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయని అంటున్నారు. శ్రీనివాస రావుతో పాటు అదనపు డీఎస్పీ స్థాయిలో ఉన్న అధికారి గణేష్ ఉత్పవాల్లో నయీమ్ తో కలిసి పూజలు చేయడం…ప్రస్తుతం సీఐడీలో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న మరో వ్యక్తి ఫోటోలు బయటకు రావడం పోలీస్ వర్గాలను మరింత కలవరపెడుతున్నాయి. ఐతే గతంలో వీళ్ళంతా నల్లగొండ జిల్లాల్లో SI నుండి CI ల వరకు విధులు నిర్వహించారు. ఐతే తాజగా విడుదలైన ఈ ఫోటోలు ఎవరు బయటపెట్టారు…? దీని వెనుక ఉన్న నిజాలేంటి…? నయీమ్ తో ఈ ఫోటోల్లో ఉన్న పోలీస్ అధికారులకు సంబంధాలు ఎంటీ అనే కోణంలో అంతర్గత దర్యాప్తు జరిపి యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందని అంటున్నాయి పోలీస్ వర్గాలు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *