నయిమ్ కేసుల్లో దర్యాప్తు కంటిన్యూ..

నయిమ్ కేసుల్లో దర్యాప్తు కంటిన్యూ..

నయిమ్ కేసుల్లో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఇప్పటికే నయిమ్ కేసుల్లో నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లా పోలీసులు.. చార్జీషీట్లు దాఖలు చేశారు. నయిమ్ కేసుల్లో ఇప్పటి వరకు మొత్తం 197 కేసులు నమోదు చేసినట్లు సిట్ అధికారులు వెల్లడించారు. 14 మందిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.

నయిమ్ కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు. నయీమ్ కేసుల్లో ఇప్పటి వరకు మొత్తం197 కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల్లో 125 మందిని అరెస్ట్ చేశారు. ఇక నయిమ్ అనుచరులైనా 330 మంది పిటీ వారంట్ పై ఉన్నారు. ఈ కేసుల్లో 878 మందిని విచారించారు పోలీసులు.. ఇక రిపీటేడ్ నేరాలకు పాల్పడుతున్న నయిమ్ అనుచరులైనా 14 మందిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో 92 మందిని పోలీసులు… కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించి.. స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు.

అయితే నయిమ్ పై ఎక్కువగా…. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో కేసులు ఉన్నాయి. 18 కేసుల్లో చార్జీషీట్లు కోర్టులో దాఖలు చేశారు. త్వరగా దర్యాప్తును పూర్తి చేసి మిగత కేసులో కూడా చార్జీషీట్లు దాఖలు చేయాలని లోకల్ పోలీసులకు సిట్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో మరి కొద్ది రోజులోనే నయిమ్ కేసుల్లో మరికొన్ని చార్జీషీట్లు దాఖలు అయ్యే అవకాశం ఉనట్లు తెలుస్తోంది.

దీంతో తర్వాత దాఖలు చేసే చార్జీషీట్లలలో ఎవరి పేర్లు ఉంటాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *