నయిమ్ అనుచరుల పై పీడీ యాక్ట్…

గ్యాంగ్ స్టర్ నయిమ్ అనుచరులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నయిమ్ అనుచరులైనా ఐదుగురిపై రాచకోండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్… పీడీయాక్ట్ నమోదు చేశారు. నయిమ్ అనుచరులపై పదుల కొద్ది కేసులు ఉండడంతోపాటు రిపీటేడ్ గా నేరాలకు పాల్పడుతుండడంతో పీడీ యాక్ట్ కేసులు పెట్టి ఏడాది పాటు జైలుకు పంపారు పోలీసులు. గ్యాంగ్ స్టర్ నయిమ్ చనిపోయిన తర్వాత కూడా నయిమ్ అనుచరులు నేరాలకు పాల్పడుతున్నారు. బెదిరింపులు, కిడ్నాపులు, భూకబ్జాలకు పాల్పడుతున్నారు. వీరిపై పోలీసులకు వరుసగా పిర్యాదులు రావడంతో రాచకోండ పోలీసు కమిషనర్ సీరియస్ అయ్యారు. దీంతో నయిమ్ అనుచరులైనా… నసీర్, బాచు నాగరాజు, హరి, జంగయ్య, పుల్లి నాగరాజులపై పీడీ యాక్ట్ నమోదు చేసి ఏడాది పాటు జైలుకు పంపారు. .1 ఇక ఈ పోటోలోని వ్యక్తి పేరు అబ్దుల్ నసీర్. నయిమ్ అనుచరుడు. ఇతడిపై 18 క్రిమినల్ కేసులు ఉన్నాయి. నోట్ల రద్దు అయినా తర్వాత నోట్ల మార్పిడిలో పలు కేసులు నమోదు అయ్యాయి. అంతేకాదు నసీర్ పై కిడ్నాప్,కుట్రలు, బెదిరింపుల కేసులు ఉన్నాయి. 2 మరో నయిమ్ అనుచరుడు బాచు నాగరాజు. బోనగిరికి చెందిన నాగరాజు ఓ మోబైల్ షాప్ నిర్వహిస్తున్నాడు. నయిమ్ అనుచరులకు నాగరాజు పేక్ సిమ్ కార్డులు ఏర్పాటు చేసేవాడు. నాగరాజుపై 9 కేసులు ఉన్నాయి. నయిమ్ చనిపోయిన తర్వాత భూ వివాదంలో తలదూర్చుతున్నాడు.3 ఇక మరో నయిమ్ అనుచరుడు జంగయ్య. ఇతడు నయిమ్ వద్ద చాలా రోజుల నుంచి డ్రైవర్ పని చేశాడు. జంగయ్యపై 26 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంతేకాదు… జంగయ్య పై కూడా కిడ్నాపులు, బెదిరింపులు, కుట్రలతోపాటు పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి.4 ఇతడి పేరు పుల్లి నాగరాజు. నయిమ్ గ్యాంగ్ లో చాలా ఏళ్లుగా పని చేశాడు. ఇతడిపై 9 కేసులు ఉన్నాయి. నాగరాజుపై కిడ్నాపులు, బెదిరింపులు, కుట్రలతోపాటు భూకబ్జాలు, రైతులను బెదిరించడం లాంటి క్రిమినల్ కేసులు ఉన్నాయి.5 మరో నయిమ్ అనుచరుడు హరి. ఇతడు కూడా నయిమ్ దగ్గర చాలా ఏళ్లుగా పని చేశాడు. హరిపై 5 క్రిమినల్ కేసులు ఉన్నాయి. బెదిరింపులు, కిడ్నాపులు, ఆస్తుల ద్వంసం లాంటి కేసులు ఉన్నాయి.ఈ ఐదుగురు నయిమ్ చనిపోయిన తర్వాత కూడా నేరాలకు పాల్పడుతుండడంతో రాచకొండ పోలీసు కమిషనర్ మహేస్ భగవత్ పీడీ యాక్ట్ నమోదు చేసి ఏడాది పాటు జైలుకు పంపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *