Breaking News

నమ్ముకున్నందుకు న్యాయం చేశాడు..

00kcr naradasu

కరీంనగర్ : సీఎం కేసీఆర్ పార్టీని నమ్ముకొని పదవి లేకున్నా ఇన్నాళ్లు వెయిట్ చేసిన నారదాసు లక్ష్మణరావుకు తగిన న్యాయం చేశారు. గత 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున కరీంనగర్ ఎమ్మెల్యే స్థానానికి నారదాసు లక్ష్మణరావు పోటీచేయాలని భావించారు. కానీ అప్పటికే టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన గంగుల కమలాకర్ కు కేసీఆర్ అభయం ఇవ్వడంతో నారదాసును బుజ్జగించారు. తప్పకుండా భవిష్యత్తులో న్యాయం చేస్తానని ప్రకటించారు. దీంతో నారదాసు అప్పటినుంచి టీఆర్ఎస్ కండువా, జెండా మోస్తూ టీఆర్ఎస్ తో ఉంటున్నారు.

ఇన్నాల్లకు మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ పార్టీని నమ్ముకొని ఉంటున్న నారదాసుకు పిలిచీ మరీ టికెట్ ఇచ్చారు సీఎం కేసీఆర్.. గెలిపించే బాధ్యతలను మంత్రి ఈటెల రాజేందర్ కు అప్పగించారు. ప్రస్తుతం పోటీ లేకపోవడం తో కరీంనగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థులు నారదాసు, భానుప్రసాద్ రావులు గెలవడం ఖాయం.. కేసీఆర్ హామీ నెరవేరడం ఖాయం..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *