Breaking News

నమస్తే x ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ

000023

తెలంగాణ పత్రికా రంగంలో ఇప్పుడు ఆంధ్రజ్యోతి వర్సెస్ నమస్తే తెలంగాణ ఫైట్ ఆసక్తి రేపుతోంది.. కేసీఆర్ కార్మిక మంత్రిగా ఫీఎఫ్ ల కుంభకోణంపై ఆంధ్రజ్యోతి వరుసగా ప్రచురిస్తూ గుబులు రేపుతుండగా.. దానికి కౌంటర్ గా అవిభక్త కవలలు వీణావాణిల కోసం ఏబీఎన్ సేకరించిన దందాలు రాధాకృష్ణ కాజేశాడంటూ నమస్తే తెలంగాణ ఓ కథనం రాసి సంచలనం సృష్టించింది..

ఈరెండు కథనాలపై తెల్లవారి మళ్లీ కౌంటర్లు ఇచ్చుకున్నాయి నమస్తే, ఆంధ్రజ్యోతి పత్రికలు.. దీంతో పత్రికల ఫైట్ చాలా ఆసక్తి గొలుపుతోంది.. ఆంధ్రజ్యోతి కథనాలు.. నమస్తే అందుకు కౌంటర్ కథనాలు వేస్తూ పాఠకులను రంజింప చేస్తున్నాయి..

రెండు పత్రికలు రెండు వ్యవస్థల మధ్య ప్రధానంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు, సీఎం కేసీఆర్ కు మధ్య ఫైట్ లా కూర్చుంది. వీణావాణిల తల్లిదండ్రులు నిన్న టీన్యూస్ లో తమ డబ్బులు రాధాకృష్ణ కాజేశాడంటూ వాపోయారు. దీనిపై స్పందించిన అడ్వకేట్ జేఏసీ నాయకులు రాధాకృష్ణ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసునమోదు చేశారు. రాధాకృష్ణ పై కేసు నమోదైతే ఇంకా ఇంట్రెస్టింగ్ గా రాజకీయ పరిణామాలు మారుతాయి.. దీంతో ఇప్పుడు పత్రికలు పోరు పతాక స్థాయికి చేరిన వేళ ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *