Breaking News

‘నమస్తే’లో ఉద్యోగుల పంట పండింది..

images

నమస్తే తెలంగాణ పత్రికలో పనిచేసే సబ్ ఎడిటర్లు, డిజైనర్ల పంట పండింది.. వచ్చే జూన్ 2కు తెలంగాణ ఆవిర్భవించి రెండేళ్లు కావస్తున్న శుభసందర్భంగా నమస్తే తెలంగాణ యాజమాన్యం ఉద్యోగులపై వరాల జల్లు కురిపేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికై హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల వేతనాలను భారీగా పెంచింది. 15వేల లోపు జీతం ఉన్న వారిని 15000 రూపాయలకు జీతాలను పెంచింది.. ఇక జిల్లాల్లో పనిచేసే ఉద్యోగుల వేతనాలను కూడా పెంచడానికి రంగం సిద్ధం అయ్యింది. వచ్చే నెలలో సగటు వేతనాలను సీనియర్లకు 18000 , జూనియర్లందరికీ 15వేల రౌండ్ ఫిగర్ కు జీతాలు పెంచేందుకు యాజమాన్యం నిర్ణయించినట్టు సమాచారం.

అధికార పార్టీ అనుబంధ పత్రిక కావడం.. మరో ఐదేళ్లు అధికారానికి టీఆర్ఎస్ కు ఢోకా లేకపోవడంతో ఇప్పుడు సంస్థలో పనిచేసే ఉద్యోగులకు తెగ హ్యాపినెస్ ఉంది. తెలంగాణ ఏర్పాటు మూలంగా ఎవరికైనా లాభం కలిగినా కలగకున్నా నమస్తే తెలంగాణలో పనిచేసే ఉద్యోగులకు మాత్రం భారీగా జీతాలు పెరిగాయి. ఈనాడు తరువాత ఎక్కువ జీతాలు తీసుకుంటున్నది వీరే కావడం గమనార్హం. సాక్షిలో సైతం జీతాలు ఇస్తున్న అందులో అభద్రత భావం ఉద్యోగుల్లో ఉంది. తీసేస్తారేమోనన్న ఆందోళన ఎక్కువ.. ఇక ఆంధ్రజ్యోతిలో మొదటినుంచి ఓ మాదిరి జీతాలతోనే నెట్టుకొస్తున్నారు. భారీగా పెంచరు.. అదే సమయంలో మరీ తీసికట్టుగా ఏమీ చేయలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీ అనుబంధ పత్రికలోనే ఉద్యోగుల జీవితాలు, జీతాలు భద్రంగా ఉన్నాయనడంలో అతిశయోక్తి కాదు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *