నత్తనడక ఏజన్సీల పై చర్యలు : హరీశ్ రావు

 

*టార్గేట్‌ జూలై

*పాలమూరు ఆన్ గోయింగ్  ప్రాజెక్టుల పై సమీక్ష .

*15 రోజులకో సారి పనుల పురోగతి సమీక్ష . 

*నత్తనడక ఏజన్సీల పై 60 సి కింద చర్యలు. 

 

పూర్వ మహబూబ్ నగర్ జిల్లాలోని ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు మంత్రి హరీశ్‌ రావు గురువారం డెడ్ లైన్ విధించారు. జూన్ చివరికల్లా   యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి జూలైలో 8 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని  అధికార యంత్రాంగాన్ని  మంత్రులు హరీశ్ రావు, జూపల్లి  ఆదేశించారు.

4 ఆన్ గోయింగ్ సాగునీటి పథకాలపై  మంత్రులు హరీశ్ రావు, జూపల్లి  జల సౌధలో గురువారం సమీక్ష జరిపారు. కల్వకుర్తి నుంచి 4 లక్షలు, బీమా నుంచి 2 లక్షలు, నెట్టంపాడు నుంచి 2 లక్షలు, కోయిల్ సాగర్ నుంచి 50 వేల ఎకరాలకు ఖరీఫ్ లో  సాగునీరందిన్చవలసిందేనని హరీశ్ రావు చెప్పారు. ఈ  ప్రాజక్టులను  యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని  నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు  ఆదేశించారు. నేటి నుంచి పదిహేను రోజులకోసారి పనుల పురోగతిని సమీక్షించాలని టైమ్ ఫ్రేమ్ లో పనులు చేయని ఏజన్సీలను ’60 సి’  నిబంధన కింద సంబంధిత ఏజన్సీ పై చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ మంత్రి ఆదేశించారు.కల్వకుర్తి, నెట్టంపాడు, బీమా, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాల కోసం ప్రాధాన్యతా  ప్రకారం ప్రభుత్వం పెట్టిన టార్గెట్  ప్రకారం పనులు  పూర్తి  చేయాలన్నారు.

కాంట్రాక్టు ఏజెన్సీలు, ఇరిగేషన్ అధికారులు, స్థానిక శాసససభ్యులు, నాయకుల సహకారంతో  పనిచేసి ప్రాజెక్టులను నిర్ణీత గడువులోపలే పూర్తి చేయాలని మహబూబ్నగర్ సి . ఇ సహా ఇంజనీరింగ్ అధికార యంత్రాoగాన్ని మంత్రి హరీష్ రావు కోరారు.  పాలమూరు జిల్లాలో ని ఆన్ గోయింగ్ సాగునీటి పధకాల లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన కృషి చేయాలన్నారు.ప్రాజెక్టుల పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు వాట్సా ప్ గ్రూప్ ద్వారా రోజువారీ సమాచారం అందించాలని హరీష్ కోరారు. నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్‌ పనులు  పూర్తి చేయాలని హరీష్‌ ఆదేశించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ జిల్లా పై ప్రత్యేక దృష్టి పెట్టారని, జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి హరీష్రావు గుర్తుచేశారు. ప్రాజెక్టుల డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, ఫీల్డు చానల్స్ లను తనిఖీలు చేయాలని ఆయా కాలువల్లో ఉన్న గడ్డి, రాళ్ళు, రప్పలు, ఇతర అడ్డంకులు తొలగించాలని కోరారు. భూసేకరణ పనుల పురోగతిని ప్రతి వారం సమీక్షించాలని ఇంజనీర్ లను  ఎమ్ ఎల్ ఏ  లను మంత్రి హరీశ్ రావు కోరారు. ఈ నాలుగు ఆన్ గోయింగ్ పథకాల కోసం ఇంకా  భూసేకరణ జరగవలసి ఉందన్నారు. భూసేకరణ, ఆర్అండ్ ఆర్ పనులు పూర్తయితే 8 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని మంత్రి తెలిపారు. ఈ నాలుగు ఆన్గోయింగ్ పథకాలకు నిధుల కేటాయింపులో అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు మంత్రి హరీశ్ రావు చెప్పారు. ప్రభుత్వ సాగునీటి రంగ సలహాదారు విద్యాసాగరరావు, స్పషల్ సి.ఎస్. జోషి,  ఇఎన్ సి మురళీధర రావు ,   ఎం.ఎల్ఏలు గువ్వల బాలరాజు, రాజేంద్రనాథ్ రెడ్డి, సిహెచ్. రాంమోహనరడ్డి, ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి, మర్రి జనార్ధనరెడ్డి, రామ్మా హన రెడ్డి, సిఇ ఖగేందర్ రావు, ఓఎస్డి దేశ్ పాండే, వివిద ఏజన్సీల ప్రతినిధులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *