
తండ్రీ కొడుకుల బ్లాక్ బాస్టర్ బాహుబలి సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు రాజమౌళి. ఈ సందర్భంగా విలేకరి రాజమౌళిని ఓ కీలక ప్రశ్న అడిగాడు.. ఇంత సక్సెస్ ఫుల్ గా సినిమాలు తీస్తూ విజయం సాధిస్తున్నారు కదా .. ఈ విజయంలో బాస్ ఎవరు..? మీరా.? మీ తండ్రి విజయేంద్ర ప్రసాద్? నా అడిగారు..
దీనికి స్పందించిన రాజమౌళి తన తండ్రి కథ కథనం వివరిస్తారని.. దర్శకత్వంలో వేలు పెట్టరని.. అప్పుడప్పుడు సూచనలు మాత్రం చేస్తుంటారు కథ నడిపించేది దర్శకత్వం పూర్తి బాధ్యత తనదేనని చెప్పారు. ఐ ది బాస్ ఆఫ్ మూవీ అని తేల్చిచెప్పారు.