
అమెరికా : ప్రముఖ నటి ఆర్తి అగర్వాల్ మృతి చెందారు. తీవ్ర శ్వాసకోశ వ్యాధితో అమెరికాలోని అట్లాంటాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. దాదాపు 25 సినిమాల్లో ఆమె నటించారు. వెంకటేశ్ తో నటించిన నువ్వు నాకునచ్చావ్ ఆమె తొలి చిత్రం, తెలుగులోని అగ్ర హీరోలందరితో నటించిన నటిగా ఆర్తి గుర్తింపు పొందింది.
కాగా 2005లో ఆమె తెలుగు హీరోని లవ్ చేసి ప్రేమ నిరాకరించడంతో ఆత్మహత్యకు ప్రయత్నించింది. అనంతరం కోలుకున్న ఆర్తి 2007లో గుజరాత్ కు చెందిన ప్రవాస భారతీయుడిని పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లిపోయింది. వివాహం అనంతరం కొద్దిగా లావు అయిన ఆర్తి మధ్యలో విడాకులు తీసుకొని మళ్లీ సినిమాల బాట పట్టింది. కానీ ఆరోగ్యం సహకరించపోవడంతో తరచూ బాధపడేది. ఈ నేపథ్యంలో శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తి ఆపరేషన్ చేయించుకుంది. అది వికటించి అమెరికాలో మృత్యువాత పడింది. ఆమె నటించిన చివరి చిత్రం రణం2.