Breaking News

నగునూరులో అభివృద్ది పనులకు ఈటెల శంకుస్థాపన

03

కరీంనగర్ : తెలంగాణ ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సోమవారం కరీంనగర్ లో పర్యటించారు. కరీంనగర్ మండలంలోని నగునూరి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఈటెల, ఎమ్మెల్యే గంగుల, జడ్పీ చైర్మన్ తుల ఉమ మాట్లాడారు..

01

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని.. మరిన్ని సంక్షేమ పథకాలు అమలుచేసి పేదలకు ఆకలి తీరుస్తామని తెలిపారు. మిషన్ కాకతీయలో చెరువులను బాగు చేసి తాగు, సాగునీటికి కొరత లేకుండా చేస్తామన్నారు. ప్రతీ పేదవాడికి అన్ని పథకాలను అందేలా చూస్తామన్నారు.నగునూరు గ్రామంలోని సీసీ రోడ్డుకు ఈటెల శంకుస్థాపన చేశారు.

06

ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఈద శంకర్ రెడ్డి, కరీంనగర్ టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్

సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్

04

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *