
గ్రేటర్ హైదరాబాద్ కంటివెలుగు కార్యక్రమం విజయవంతం చేద్దాం
నగరం లో ఈ నెల 15 వ తేదీ నుండి ప్రారంభమయ్యే కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతీ కార్పొరేటర్ కృషి చేయాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపునిచ్చారు. నేడు నగరంలోని కార్పొరేటర్లతో టెలీకాన్ఫ్‌రెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్బంగా ఈ క్రింది విషయాలు టెలీ కాన్ఫ్‌రెన్స్‌లో మాట్లాడారు.
* జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 150 వార్డులలో 1.20 కోట్ల జనాభా ఉంది.
* ప్రతి వార్డులో సుమారుగా 80వేల జనాభా ఉంది.
* నేత్ర సంబంధిత వ్యాధులపై చేసిన అద్యయనంలో 20శాతం మందికి కంటి సంబంధిత సమస్యలు ఉన్నాయని అంచనా.
* జీహెచ్ఎంసీ పరిధిలో 24లక్షల మంది కంటి సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు.
* ఈ 24లక్షల మందిలో 53 శాతం (12.70లక్షల) మందికి .25/.75 పాయింట్ ఉన్న రీడింగ్ అద్దాలు పంపిణీ చేయడం జరుగుతుంది.
* వీరిలో పది శాతం (2.40లక్షల)మంది దృష్టిలోపం ఉన్నవారు క్యాంపుకు హాజరైన అనంతరం వారంరోజుల్లో కంటి అద్దాలు అందజేస్తారు.
* మరో 11శాతం (2.64లక్షల) మందికి ఆపరేషన్ల నిర్వహణకు మరోసారి పరీక్షలకు రెఫర్ చేస్తారు.
* కంటి అద్దాల పంపిణీకి సంబంధించి నేత్ర పరీక్షలు నిర్వహించడానికి శిక్షణ పొందిన డాక్టర్లు, ఆప్తాల్మజిస్ట్ లను నియమిస్తున్నాం.
* ఒకొక్కరు రోజుకు కేవలం 35మందిని మాత్రమే పరీక్షించగలుగుతారు.
* మొత్తం 17.76 లక్షల మందికి కంటి పరీక్షల నిర్వహణకు రోజుకు 35చొప్పున 50,000 మాన్‌డేస్ పడుతాయి.
* వంద వర్కింగ్ డేలు ఉంటే 500మంది శిక్షణ పొందిన డాక్టర్లు, ఆప్తాల్మజిస్ట్ లు అవసరమవుతారు.
* ఒకొక్క స్క్రీనింగ్ టీమ్‌లో ముగ్గురు సభ్యులు ఉంటారు. వీరిలో ఒకరు కేస్ షీట్ రాయడం, డాక్టర్లు, కంటి అద్దాలు పంపిణీ చేసేవారు ఉంటారు.
* ప్రతి క్యాంప్‌లో రోజుకు 200మందికి సంబంధిత స్టాఫ్ నర్స్ ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు.
మీ పరిధిలోని ప్రతీ ఒక్కరిని కంటి వెలుగులో నేత్ర సంబంధిత పరీక్షలు చేయించుకునేవిధంగా కార్పొరేటర్లు కృషి చేయాలని మేయర్ కోరారు.