Breaking News

నగరంలో ట్రాఫిక్ దారి మళ్ళింపు చర్యలు

నగరంలో నేడు ట్రాఫిక్ దారి మళ్ళింపు చర్యలు

కరీంనగర్: మిలాద్-ఉన్-నబి పర్వదినం సందర్భంగా సోమవారం నాడు కరీంనగర్ జిల్లాలో ట్రాఫిక్ దారి మళ్ళింపు చర్యలను అమలు చేయనున్నామని పోలీస్ కమీషనర్ వి.బి కమలాసన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దారి మళ్ళింపు చర్యలకు అన్ని వర్గాల ప్రజలు తమవంతు సహకారం అందజేయాలని కోరారు. దారిమళ్ళింపు వివరాలలోకి వస్తే పెద్దపల్లి నుండి కరీంనగర్ కు వచ్చే వాహనాలు బొమ్మకల్ ఫ్ల్త్తె ఓవర్ క్రాస్ రోడ్డు నుండి హౌజింగ్ బోర్డు కాలని, కమాన్ మీదుగా నగరంలోకి చేరుకోవాలని సూచించారు. చొప్పదండి నుండి వచ్చే వాహనాలు మంచిర్యాల చౌరస్తా నుండి నాఖా చౌరస్తా, కమాన్ మీదుగా నగరంలోకి చేరుకోవాలని ఆయన అన్నారు. జగిత్యాల వైపు నుండి వచ్చే వాహనాలు మంచిర్యాల క్రాస్ రోడ్డు, నాఖా చౌరస్తా, కాపువాడ మీదుగా నగరంలోకి ప్రవేశించాలన్నారు. సిరిసిల్లా నుండి వచ్చే భారీ వాహనాలు మానేరు స్కూల్, పద్యానగర్ మీదుగా ఎన్టీఆర్ విగ్రహం మీదుగా వెళ్ళాలన్నారు. దారి మళ్ళింపు చర్యలు అమల్లో ఉన్నయని గుర్తించి సూచించిన మార్గాలలో ప్రయాణించాలని వారికి సహకరించాలని వి.బి కమలాసన్ రెడ్డి చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *