Breaking News

నగరంలో కల్తీ పాల పౌడర్

నగరంలో కల్తీ పాల పౌడర్

స్వచ్ఛమైన పాలనే కాదు పాల పౌడర్ ను కల్తీ చేస్తున్నారు కన్నింగ్ గాళ్ళు. ఇప్పటికే రసాయనాలు, సన్ ఫ్లవర్ ఆయిల్ తో పాలను తయారు చేస్తున్న నకిలీగాళ్ళు..పాల పౌడర్ పాకెట్లను కూడా కల్తీ చేస్తున్నారు. సైదాబాద్, మాదన్న పేట్ అడ్డాగా సాగుతున్న ఈ కల్తీ కేంద్రాలపై దాడులు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు 5 క్వింటాళ్ళ నకిలీ పాల పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు.
ఇక్కడ కనిపిస్తున్న పాల పౌడర్ ప్యాకెట్లు ఆగ్రాకు చెందిన దోల్ పురా ఫ్రెష్ అనే ఓ ప్రముఖ కంపనీకి చెందినవి. ఈ మిల్క్ పౌడర్ ప్యాకెట్లను ఎక్కువగా హోటళ్ళు, చిన్నచిన్న టీ స్టాల్స్ నిర్వాహకులు కొనుగోలు చేస్తుంటారు.ఆగ్రా, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల నుండి సిటీకి సరఫరా అవుతున్న ఈ పాల పౌడర్ పాకెట్లకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయి. ఐతే ఇక్కడికి వచ్చే ఈ మిల్క్ పౌడర్ ను డీలర్లు. ఏజెంట్లు కల్తీ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఇందులో 300 రూపాయల విలువ చేసే మిల్క్ పౌడర్ ప్యాకెట్ లో చక్కెర పౌడర్, పాలివాల్ అనే పౌడర్ ను కలిపి కల్తీ చేస్తున్నారు.
సైదాబాద్,మాదన్న పేట్ లు అడ్డాలుగా సాగుతున్న ఈ దందాపై దోల్ పుర్ ఫ్రెష్ కంపనీ చేసిన ఫిర్యాదుతో దాడులు జరిపిన సిటీ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు..పాల పౌడర్ కల్తీని గుర్తించారు. ఇందులో 300 విలువ చేసే ఈ పాల పౌడర్ ప్యాకెట్లలో 100 రూపాయల వరకు విలువ చేసే పౌడర్ ను తీసి..అందులో చక్కెర పౌడర్ తో పాటు పాలివాల్ అనే పౌడర్ ను కలుపుతున్నారు. ఇలా మిల్క్ పౌడర్ ను కల్తీ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న ఇద్దరు ముఠాను సభ్యులను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు..ఈ ప్యాకెట్లను హోటళ్లు, స్వీట్ హౌస్ లకు సప్లయ్ చేస్తున్నారని గుర్తించారు.వీరి వద్ద నుండి 400 మిల్క్ పౌడర్ ప్యాకెట్లతో పాటు 500 కిలోల నకిలీ పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు.
ఐతే ఓల్డ్ సిటీ అడ్డాగా రెచ్చిపోతున్న కల్తీ మాఫియాపై పోలీసులు ఎన్ని దాడులు జరిపినా..ఆహార పధార్ధాల్లో జరుగుతున్న కల్తీ కామన్ మెన్ను కలవర పెడుతోంది.ఇలాంటి ఫుడ్ ఐటెమ్స్ కొనేటప్పడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ముప్పు తప్పదంటున్నారు డాక్టర్లు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *