నకిలీ బంగారాన్ని నిజమైందిగా నమ్మిస్తూ మోసం చేస్తున్న రాజస్తాన్ ముఠాను అరెస్ట్ చేసిన కరీంనగర్ టాస్క్ ఫోర్స్

నకిలీ బంగారాన్ని నిజమైందిగా నమ్మిస్తూ మోసం చేస్తున్న రాజస్తాన్  ముఠాను అరెస్ట్ చేసిన కరీంనగర్ టాస్క్ ఫోర్స్
 ఇద్దరి అరెస్ట్…
నకిలీ బంగారం స్వాధీనం…
కేసు నమోదు..రిమాండ్ కి తరలింపు…
కరీంనగర్ పట్టణం తో పాటుగా ,వివిధ ప్రాంతాలలో నకిలీ బంగారాన్ని నిజమైనది గా నమ్మిస్తూ,అమాయక ప్రజలను మోసం చేస్తున్న రాజస్తాన్ రాష్ట్రానికి చెందినా ఇద్దరు సబ్యులు గల ముఠాను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్,వారి వద్ద నుంచి నకిలీ బంగారాన్ని స్వాధీనం చేసుకొని,కరీంనగర్ ఒకటవ పట్టణ పోలిసుల సహాయంతో రిమాండ్ కు తరలించడం జరిగింది….
*నేరం చేయు విధానం…:*
రాజస్తాన్ రాష్ట్రంలోని సిరొహి జిల్లాకు చెందిన సోళంకి రమేష్, రాజు ఆకాశ్ అను ఇద్దరు గత కొద్దీ రోజుల క్రితం కరీంనగర్ పట్టణానికి వచ్చి,శివారులో తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకొని,ప్లాస్టిక్ పూలు ఆమ్ముతున్నట్లుగా నటిస్తూ,పట్టణం తో పాటు చుట్టూ పక్కల గ్రామాల్లో తిరుగుతూ అమాయక ప్రజలను గుర్తించి,వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని,వారిని మాయ మాటలతో పరిచయం చేసుకొని,వారి వద్ద చాల బంగారం ఉందని,బంగారాన్ని చుట్టూ పక్కల రాష్ట్రాల్లో తక్కువ ధరకు,భారీగా తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ధరకన్నా చాల చాలా తక్కువ రేటుకు ఆమ్ముఁథామని నమ్మించి,ముందుగా వారి వద్ద ఉన్న నిజమైన బంగారాన్ని చూపించి,అది వారి ముందే పరీక్షించి చూపేట్టి,వారికి నమ్మకం కలిగించి,తరువాత వారిని డబ్బులు తెచ్చుకొమ్ముని చెప్పి,డబ్బులు ముట్టినాక నకిలీ బంగారం అప్పగించి,వెంటనే ఆ ప్రదేశాన్ని వదిలివెళ్లారు…మల్లి వేరే ప్రాంతానికి వెల్లి అక్కడ కూడా ఇలాగే మోసాలు చేస్తుంటారు….
*పట్టుబడిన విదానం….:*
కరీంనగర్ పట్టణానికి చెందినా దయ్యాల మల్లయ్య గత రెండు రోజుల క్రితం కరీంనగర్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళగా ,అక్కడకి రాజస్తాన్ కి చెందిన సోఁళంఖీ రమేష్, రాజు ఆకాశ్ అను ఇద్దరు వచ్చి మల్లయ్య ని పరిచయం చేసుకొని,వారి వద్ద 16 నుంచి 20 తులాల బంగారం ఉందని నమ్మించి,అట్టి బంగారం బయట మార్కెట్లో 4 నుంచి 5 లక్షల వరకు ఉంటదని,నీకు 50,000/- రూపాయలకే ఇస్తాం అని నమ్మించి,డబ్బులు తీసుకోని రమ్మని చెప్పగా,అతను డబ్బులు తీసుకోని వెళ్ళగా,ఇట్టిది మోసం అని తెలిసి,టాస్క్ ఫోర్స్కి సమాచారం ఇవ్వగా,చాకఛక్యాంగ నిందితులను పట్టుకోని,వారిని కరీంనగర్ ఒకటవ పట్టణ పోలిసుల సహాయం తో రిమాండ్ కి తరలించడం జరిగింది….
*నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న సొత్తు….:*
~ఒక మొబైల్ ఫోన్….
~నకిలీ బంగారం…
*నిందితుల పూర్తి వివరాలు…:*
1.సోలంకి  రమేష్ s/o మోతీలాల్,30సం, బగ్రి,r/o నరదర గ్రామం,సిరోహి జిల్లా,రాజస్థాన్ రాష్ట్రం….
2.రాజు ఆకాశ్ s/o భవర్,20సం, బగ్రి,r/o నరదర గ్రామం,సిరోహి జిల్లా,రాజస్థాన్ రాష్ట్రం….
*నిందితులను పట్టుకోవడం లో శ్రమించిన పోలీసులు….:*
1.శ్రీనివాసరావు,సిఐ,టాస్క్ ఫోర్స్…
2.శ్రీనివాసరావు,సిఐ,కరీంనగర్ వన్ టౌన్…
3.మాధవి,సిఐ,టాస్క్ ఫోర్స్…
4.కిరణ్,సిఐ,టాస్క్ ఫోర్స్…
మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది…
IMG-20180203-WA0116

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *