Breaking News

నకిలీ నోట్ల ముఠా అరెస్ట్ చేశారు.

sp

హైదరాబాద్, ప్రతినిధి : పారిశ్రామిక ప్రాంతం గోదావరిఖని కేంద్రంగా నకిలీ రూపాయల నోట్లను చెలామణి చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు ఆదివారం ఉదయం అరెస్ట్ చేసి వీరి వద్ద నుంచి 3,65,500 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
గోదావరిఖని మార్కండేయ కాలనీలో నివాసముంటున్న ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలికి చెందిన అరవింద్ కుమార్ (39) ఈ నకిలీ నోట్ల రాకెట్ ను కొనసాగించడంలో ప్రధాన పాత్ర పోషించారు. బంగ్లాదేశ్ నుంచి నకిలీ నోట్లు ఈ ముఠా సభ్యులకు అందుతున్నాయి.

పకడ్బందీ సమాచారం అందుకున్న గోదావరి ఖని పోలీసులు ఆదివారం బస్టాండ్ మార్కండేయ కాలనీ ప్రాంతంలో మాటువేసి ఈ ముఠా సభ్యులను ఆరెస్ట్ చేశారు. పశ్చిమబెంగాల్ ముర్షిదాబాద్ జిల్లా చెర్రాజ్ పూర్ నకు చెందిన సునీల్ ప్రామాణిక్ (37), మార్కండేయ కాలనీలో ఉంటున్న ఉత్తరప్రదేశ్ వాసి అరవింద్ కుమార్ , సుదర్శన్ సింగ్ , జగదీష్ గుజ్జర్, ఆదిలాబాద్ కు చెందిన జగదీష్ గుజ్జూర్ (35), నిజామాబాద్ వాసి వెట్నూరి రాజయ్య (40) , జగిత్యాలకు చెందిన దుర్వ భీంరావ్ (43)లను అరెస్ట్ చేసి వీరి వద్ద నుంచి 3,65,500 రూపాయల నకిలీ స్కాంను స్వాధీనం చేసుకున్నారు.

ఈ ముఠా ఒక లక్ష రూపాయల నకిలీ నోట్లకు 40 వేల అసలు రూపాయలు తీసుకుంటుంది. ఈ నకిలీ నోట్ల ముఠాను జిల్లా ఎస్పీ శివకుమార్ విలేకరులకు చూపించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *