
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఇకపై ఉత్తమ సినిమాలకు, ఆర్టిస్టులకు ఇచ్చే నంది అవార్డుల పేరును మారుస్తామని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు.
తెలంగాణలో నంది అవార్డులకు కొత్త పేరు పెడతాం..సీఎం కేసీఆర్ పరిశీలనలో మూడు పేర్లు ఉన్నాయి..వాటిలో ఏకశిల, కాకతీయ పేర్లను ముఖ్యంగా పరిశీలిస్తున్నాం అని ఆయన చెప్పారు. ఏపీ ప్రభుత్వం నంది పేరిట అవార్డులను కొనసాగిస్తే మాకు సంబంధం లేదని తలసాని అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు తమ ప్రభుత్వం బాసటగా ఉంటుందని ఆయన చెప్పారు.