
ప్రపంచ క్రికెట్ లో గొప్ప ఫినిషర్ ఎవరయ్యా అంటే చిన్న పిల్లలనుంచి పెద్దవాళ్ల వరకు ధోని పేరే చెబుతారు.. కానీ అదే దోనీ పని అయిపోయినట్టే కనపడుతుంది..నిన్న సౌతాఫ్రికా తో జరిగిన మ్యాచ్ చూస్తే ధోనిని చూసినవారందరూ ఇలాగే చెబుతారు. రబడ అని సౌతాఫ్రికా బౌలర్ .. 20 ఏళ్లు ఉంటాయి.. ధోనీ క్రికెట్ టీవీలో ఆడుతున్నప్పుడు టీవీలో చూశాడట.. అలాంటి పిల్లాడు ధోనిని కేవలం 6 బంతుల్లో 11 పరుగులు చేయకుండా అడ్డుకొని సౌతాఫ్రికాను గెలిపించి ఇండియాను ఓడించారు.
గోప్ప ఫినిషర్ కాస్త రబడ అనే కుర్రాడి బౌలింగ్ ను ఎదుర్కోలేకపోయాడు. మొదటి బంతికే కొట్టలేక గాల్లోకి లేపి ఔటయిపోయాడు.. దీంతో దోని ఆట మరిచిపోయాడా లేక.. కొట్ట శాతనైతలేదా అని చూసిన అభిమానులంతా నోరెల్లబెట్టారు. గొప్ప ఫినిషర్ సాధారాణ ఆటగాడిగా ఆపసోపాలు పడుతున్న వేళ ఇండియా ఓటమి పరంపర కొనసాగిస్తోంది..