ధిక్కారంపై వేటు

prasanth yogendra

ఆమ్ ఆద్మీ పార్టీలో ముసలం సద్దుమణిగింది. కొద్ది రోజులుగా రగులుతున్న ఆమ్ ఆద్మీలో రగులుతున్న పదవుల లొల్లి కొలిక్కి వచ్చింది. పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పై తిరుగుబావుటా ఎగురవేసిన ఆప్ నేతలు ప్రశాంత్ భూషన్, యోగేంద్ర యాదవ్ లపై ఆమ్ ఆద్మీ పార్టీ వేటు వేసింది. కొన్నాళ్లుగా కొనసాగుతున్న ఈ వివాదానికి తెరపడింది.

కేజ్రీవాల్ ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎంగా రెండు పాత్రల్లో ఉండడంపై ఆప్ నేతలు ప్రశాంత్, యోగేంద్ర కొద్ది రోజులుగా విమర్శలు చేస్తూ జాతీయ కార్యవర్గానికి లేఖలు రాశారు. ఇవి పార్టీలో అంతర్గత కలహాలకు దారితీశాయి. దీంతో ఢిల్లీలో బుధవారం సమావేశమైన ఆప్ జాతీయ కార్యవర్గం ప్రశాంత్, యోగేంద్రలను తొలగించేందుకు నిర్ణయించింది. వారిద్దరిపై ఓటింగ్ నిర్వహించింది. ఓ ఓటింగ్ లో అనుకూలంగా 11 ఓట్లు, వ్యతిరేకంగా 8 ఓట్లు పడడంతో వారిని పార్టీ నుంచి తొలగించింది.

ఢిల్లీ ప్రజలు అఖండ మెజార్టీ ఇచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిస్తే.. గద్దెనెక్కిన నెల రోజుల్లోనే పార్టీలో ముసలం రావడంపై ఆప్ కార్యకర్తలు ఆందోళన చెందారు. ఈ పరిణామాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి. కేజ్రీవాల్ ఆప్ కన్వీనర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో సమావేశమైన ఆప్ కార్యవర్గం కేజ్రీవాల్ రాజీనామాను తిరస్కరించి, యోగేంద్ర, ప్రశాంత్ లపై ఓటువేసింది. దీంతో ఆమ్ ఆద్మీ వివాదం సుఖాంతమైంది.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *