ధాన్యం సేకరణ పై జిల్లా కలెక్టర్లు ప్రతిరోజూ సమీక్షించాలి : మంత్రి హరీష్ రావు

మంత్రి హరీష్ రావు

ధాన్యం సేకరణ పై ప్రతిరోజూ సమీక్షించాలని  జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ లను మార్కెటింగ్ మంత్రి హరీశ్ రావ్ ఆదేశించారు.ఆయన గురువారం కొందరు జిల్లా కలెక్టర్లతో ఫోన్ లో మాట్లాడారు.కొన్ని పత్రికల్లో ధాన్యం క్రయ విక్రయాలపై వస్తున్న  వార్తలపై అసంతృప్తి వ్యక్తంచేశారు. వరి ధాన్యం కొనుగోళ్ల కు సంబంధించి ఇదివరకే వీడియో కాన్ఫరెన్సులో జిల్లా ఉన్నతాధికారులు,పౌరసరఫరాల అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.మార్కెట్ లలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిని ప్రతిరోజూ జిల్లా కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ సమీక్ష జరపాలని హరీశ్ రావు కోరారు.ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.   ధాన్యం కనీస మద్దతు ధర  కల్పించాలన్నారు. తేమ శాతం  17 లోపు  ఉండాలని రైధాన్యం సేకరణ పై ప్రతిరోజూ సమీక్షించాలి.

జిల్లా తులలో విస్తృత ప్రచారం చేయాలని  కోరారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖ, .కె.పి శాఖ ద్వారా ప్రచారం చేయాలని, రైతులకు అవగాహన కల్పించాలని మార్కెటింగ్ మంత్రి ఆదేశించారు.సరిహద్దు జిల్లాల్లో పొరుగు రాష్ట్రాల వ్యాపారులు కొనుగోలు చేయవచ్చూనని అన్నారు.అయితే రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్పోస్టులను పటిష్టం చేయాలని కోరారు.వర్ష సూచన ఉన్న సందర్భాలలో వ్యవసాయ మార్కెట్ లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు.ధాన్యం తడవకుండా జాగ్రత్తలు     తీసుకోవాలని కోరారు.రైతులకు కనీస మద్దతు ధర వచ్చేలా చూడాలని మంత్రి ఆదేశించారు.ధాన్యం కొనుగోళ్ల తర్వాత చెల్లింపులు 48  గంటలలోనే  జరిగెటట్లు చర్యలు తీసుకోవాలని కోరారు.రైతుల సమస్యలు, క్రయవిక్రయాలలో తలెత్తే ఇతర పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి పరిష్కరించాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. రోజు కారోజు మార్కెట్ నుంచి ధాన్యం మిల్లులకు, గోడౌన్లకు తరలించాలని మంత్రి సూచించారు. ధాన్యం రవాణా కోసం అవసరమైతే  లారీల కోసం రవాణా శాఖను సంప్రదించి   శాఖ సహకారం తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *