ధర్మపురి లో స్పీకర్ సిరికొండ పుష్కర స్నానం..

speaker

జూలై24: తెలంగాణ శాసనసభ స్పీకర్ సిరికొండ మధూసుధనాచారి తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం నాడు కరీంనగర్ జిల్లా ధర్మపురి లో పుష్కర స్నానం ఆచరించారు. తన భార్య, కొడుకులు, కోడలు, మనువరాలుతో కలిసి గోదావరి నదిలోపుష్కర స్నానం చేశారు. ఆయన వెంట ప్రభుత్వ ప్రధాన విప్ కొప్పుల ఈశ్వర్, శాసనసభ్యులు ఏనుగు రవిందర్ రెడ్డి, టిఆర్ఏస్ నాయకులు గంగుల అశోక్, పాడి ప్రతాప్ రెడ్డి, సింగారం శ్రీనివాస్ రెడ్డి, ఏకానందం, ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం స్పీకర్ సిరికొండ మధూసుధనాచారి తన సకుటుంబ సమేతంగా శ్రీ లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *