‘ద బెల్స్’ ఆడియో ఆవిష్కరణ

రాహుల్, నేహ దేశ్ పాండే హీరోహీరోయిన్లుగా జగదాంబ ప్రొడక్షన్స్ పతాకంపై నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో ఎర్రోజు వెంకటాచారి నిర్మిస్తున్న లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ద బెల్స్’. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ హోటల్ లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర్ర భారీ నీటి పారుదల శాఖ సలహాదారు ఆర్. విద్యాసాగర్ రావు ‘ద బెల్స్’ఆడియోను ఆవిష్కరించి తెలంగాణ విప్ నల్లాల ఓదేష్ కి అందించారు. కాసర్ల శ్యామ్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుదలైంది. ఇంకా ఈ కార్యక్రమంలో స్పీకర్ మధుసూదనాచారి, రసమయి బాలకిషన్, ఎన్.శంకర్, ఇంద్రకిరణ్ రెడ్డి, అల్లాణి శ్రీధర్, సానా యాదిరెడ్డి, సంగీత దర్శకుడు కాసర్ల శ్యామ్, హీరో రాహుల్, నిర్మాత ఎర్రోజు వెంకటాచారి, నెల్లుట్ల ప్రవీణ్ చందర్ మరియు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

రాష్ట్ర్ర్ర భారీ నీటి పారుదల శాఖ సలహాదారు విద్యాసాగర్ రావు మాట్లాడుతూ.. ‘నిర్మాత వెంకటాచారి గారు ఎంతో అభిరుచితో ఈ సినిమా చేశారు. ట్ర్రైలర్స్, సాంగ్స్ చాలా బాగున్నాయి. వినోదంతో పాటు చక్కటి సందేశాత్మక చిత్రంలో నేను కూడా ఓ చిన్న పాత్రలో నటించడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఆడియో, సినిమా పెద్ద హిట్ అయి నిర్మాతకు, చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నానని’’అన్నారు.

స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ ‘‘సినిమా అనేది కొన్ని వర్గాలు, కొందరు వ్యక్తులకు మాత్రమే పరిమితమైంది. తెలంగాణ ఎంతో డెవలప్ అవుతున్న తరుణంలో తెలంగాణ లోని నిర్మాతలు, దర్శకులు సినిమాలు రూపొందించడం చాలా సంతోషంగా వుంది. ఈ ట్ర్రైలర్ చూశాక సినిమా కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని’’అన్నారు.

దేవాదయ శాఖ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి మాట్లాడుతూ… ‘‘ఈ చిత్రంలో ఆదిలాబాద్ లోని పలు అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించారనుకుంటున్నాను. పాటలు, ట్ర్రైలర్స్ బావున్నాయి. తెలంగాణ రాష్ట్ర్రం ఏర్పడిన తర్వాత ఇంత మంచి సినిమా చేయడం ఆనందంగా వుంది. తొలిసారిగా ఓ మంచి ప్రయత్నం చేస్తున్న ఈ దర్శక నిర్మాతలకు ఈ చిత్రం మంచి ఫలితాలివ్వాలని ఆకాంక్షిస్తున్నానని’’అన్నారు.

ఎమ్ ఎల్ ఎ రసమయి బాలకిషన్ మాట్లాడుతూ… ‘‘అభిరుచి గల నిర్మాత, ప్రతిభావంతుడైన దర్శకుడు చేసిన అద్భుతమైన చిత్రం‘ద బెల్స్’.చిత్రానికి సంగీతం అందించిన శ్యామ్ నాకు ఎప్పటి నుంచో తెలుసునని అతను మంచి పాటల రచయిత కూడా అని వ్యాఖ్యానించారు. తనకు ఈ సినిమా తప్పకుండా మంచి పేరు తెస్తుందన్నారు. అలాగే దర్శకనిర్మాతలకు కూడా ఈ సినిమా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నా’’అన్నారు.

హీరో రాహుల్ మాట్లాడుతూ… ’’ప్రవీణ్ గారు ఎంతో టాలెంట్ వున్న డైరెక్టర్. శేఖర్ అందించిన కధను చాలా బాగా హ్యండిల్ చేసి, మంచి సినిమా తీశారు. మా నిర్మాత వెంకటాచారి గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని చాలా రిచ్ గా తీశారు. కాసర్త శ్యామ్ చేసిన పాటలన్నీ చాలా బాగున్నాయి.‘మ్యూజిక్ మ్యూజిక్’తర్వాత నేను హీరోగా చేస్తున్న రెండో సినిమా ఇది అని’’అన్నారు.

చిత్ర నిర్మాత ఎర్రోజు వెంకటాచారి మాట్లాడుతూ… ‘‘ఆడ పిల్లనమ్మా నేను.. ఆడ పిల్లనోయి..’పాటతో పాపులర్ అయిన కుమారి మధుప్రియ మీద చిత్రీకరించిన ‘అక్క నేనేమి సేతు..’అన్న పాట మా సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఈ చిత్రంలో చక్కని సందేశంతో పాటు ఆడియన్స్ కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ వున్నాయి. ఇప్పటి వరకు సినిమా క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీపడకుండా నిర్మించాము. ఇందులో విద్యాసాగర్ రావు గారు కూడా నటించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాకు కెమెరా, మ్యూజిక్ హైలెట్ గా నిలిచే అంశాలు. సినిమా తీయాలన్నా నా చిన్ననాటి కల ఈ సినిమాతో నెరవేరుతున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రాన్ని ఆదరించి ప్రేక్షకులు మరెన్నో చిత్రాలు నిర్మించే అవకాశాన్ని అందిస్తారని ఆశిస్తున్నానన్నారు. ప్రవీణ్ చెప్పిన దానికంటే ఎన్నో రెట్లు అందంగా తెరమీద చూపించాడు. ఒక కమర్షియల్ సినిమాకి వుండాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయన్నారు. ఈ సినిమా ద్వారా యూత్ కి ఒక మంచి సందేశాన్ని కూడా అందిస్తున్నాం’’అన్నారు.

దర్శకుడు నెల్లుట్ల ప్రవీణ్ చందర్ మాట్లాడుతూ… ‘అనుకున్నది అనుకున్నట్లుగా పూర్తి చేయగలిగామంటే మా నిర్మాత ప్లానింగే కారణం. ఆయన ఎక్కడా రాజీ పడలేదు. మా చిత్రంలో శ్రీ విద్యాసాగర్ రావుగారు అతిధి పాత్రలో నటించడం విశేషం. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులు మంచి సహయ సహకారాలు అందించారు. ఈ సినిమాలో మంచి కధతోపాటు చక్కని మెసేజ్ కూడా ఉంటుంది. సినిమా చాలా బాగా వచ్చిందన్నారు. కాసర్ల శ్యామ్ మ్యూజిక్ చాలా బాగుంది. పాటలు కూడా విజువల్ గా అద్భుతంగా వచ్చాయి. ఇలాంటి మంచి సినిమా చేయడానికి తన పూర్తి సహకారాన్ని అందించిన వెంకటాచారిగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’అన్నారు.

సంగీత దర్శకుడు కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ… ‘క్లారిటీ ఉన్న దర్శకుడు ప్రవీణ్ గారు. క్వాలిటీతో పాటులు చేయగలిగానంటే మా నిర్మాత రాజీ పడని తత్వమే కారణమన్నారు. ఓ మంచి సినిమాకు సంగీతాన్ని సమకూర్చే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా’అన్నారు.

రాహుల్, నేహ దేశ్ పాండే, సూర్య, శివారెడ్డి, చలపతి, జబర్ దస్త్ అప్పారావు, జబర్ దస్త్ మూర్తి, సాధురామకృష్ణ, మిధున్ సామిరెడ్డి, నిట్టల, గౌతమి, వైజాగ్ ప్రసాద్, గాయని మధుప్రియ, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:ఉదయ్, సంగీతం: కాసర్ల శ్యామ్, పాటలు: వరికుప్పల యాదగిరి, గోరేటి వెంకన్న, కాసర్ల శ్యామ్, కూనాడి వాసుదేవరెడ్డి, రచన-మాటలు: శేఖర్ విఖ్యాత్, నిర్మాత: ఎర్రోజువెంకటాచారి, కధ-స్క్ర్రీన్ ప్లే-దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చందర్.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *