‘దొరకడు’కు హిట్ టాక్

శివాజీ టైటిల్ పాత్రలో చంద్రకళ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి చంద్రకళ సమర్పణలో ‘మాస్టర్ ఆర్.యు.శ్రీరామ్ అజయ్-మాస్టర్ మనోజ్ సాయిశ్రీరామ్’నిర్మిస్తున్న యాక్షన్ ఓరియంటెడ్ హరర్ ఎంటర్ టైనర్ ‘దొరకడు’.వరప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శివాజీ సరసన గాయత్రి హీరోయిన్ గా నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 6న రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకులు వరప్రసాద్ మాట్లాడుతూ.. ‘టైటిల్ కు తగ్గట్టుగానే కాకుండా.. ఇప్పటి ట్రెండ్ కు తగినట్లుగా రూపొందిన యాక్షన్ అండ్ హరర్ ఎంటర్ టైనర్ ‘దొరకడు’.మా హీరో శివాజీ కెరీర్ లో గర్వంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో ఒకటిగా ఈ చిత్రం నిలుస్తుంది. శివాజీ హిట్ ఫిలింస్ ‘మంత్ర, బూచోడు-బూచమ్మ’చిత్రాల కోవలో ‘దొరకడు’కూడా ప్రేక్షకుల్ని అమితంగా అలరిస్తుంది’అన్నారు. సుమన్, అజయ్, బాబుమోహన్, కొండవలస, గౌతంరాజు, చిత్రం శ్రీను, ఘర్షణ శ్రీనివాస్, ఛత్రపతి శేఖర్, శిల్ప, శిరీష, నాన్సీ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి- సంగీతం: సునీల్ ధర్మా, సమర్పణ: శ్రీమతి చంద్రకళ, నిర్మాతలు: మాస్టర్ ఆర్.యు.శ్రీరామ్ అజయ్-మాస్టర్ మనోజ్ సాయిశ్రీరామ్, కధ-స్క్ర్రీన్ ప్లే-దర్శకత్వం: వరప్రసాద్!!

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *