
వరంగల్ , ప్రతినిధి : దొడ్డి కొమురయ్య భవన్ హైదరాబాద్ లో లేకపోవడం బాధాకరమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఆదివారం వరంగల్ జిల్లాలోని కొమరవెల్లి మల్లన్న కల్యాణోత్సవంలో ఆయన పాల్గొన్నారు. సీఎం కేసీర్ తో పాటు కేంద్ర మంత్రి దత్తాత్రేయ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మల్లన్న స్వామికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం కురుమ సంఘం భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్..కేంద్ర మంత్రి దత్తాత్రేయ పాల్గొన్నారు. ఎకరంన్నర స్థలంలో ఐదు కోట్ల రూపాయలతో దొడ్డి కొమురయ్య భవనం ఏర్పాటు చేస్తానని, దీనికి సంబంధించిన జీవో సోమవారం జారీ చేస్తామని హామీనిచ్చారు. గొర్రెల పెంపకం దారుల్లో మేథో సంపత్తి ఉందని, వారి పిల్లలకు చదువులు చెప్పిస్తే బాగుంటుందని కేసీఆర్ పేర్కొన్నారు.