దొంగ పోలీసు

అతనో ఖాకీ చొక్కా వేసుకున్న కనిపించని కరప్షన్ కింగ్. గతంలో యూనిఫాంను అడ్డు పెట్టుకుని అవినీతికి పాల్పడ్డ అతగాడు… పెద్దనోట్ల రద్దుతో కొత్తనోట్ల వేట ప్రారంభించాడు. అందుకు ఓ రాజకీయ నాయకుడితో కలిసి పక్కా స్కెచ్ వేసి ఒకటిన్నర కోట్లను దోచేసాడు. సినీఫక్కీలో జరిగిన ఈ దోపిడీతో బంజారాహిల్స్,జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. సినిమా స్టోరీనే తలదన్నేలా జరిగిన ఈ దోపిడీ కేసులో ఇన్ స్పెక్టర్ రాజశేఖర్ తో పాటు మరో పది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు….వారి వద్ద నుంచి  52 లక్షల రూపాయలు, రెండు కార్లు, ఓ బొమ్మ తుపాకి, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పెద్దనోట్ల రద్దుతొ కొందరు ఖాకీలకు కాసుల పంట పండుతోంది. కొందరు వెహికిల్ చెకింగ్స్ పేరుతో దారిదోపిడీలకు పాల్పడుతుంటే మరికొందరు ఇన్ స్పెక్టర్లు అడ్డదారుల్లో అందినంతా దోచేస్తున్నారు. సిటీలోని చోటామోటా రాజకీయ నాయకులతో జతకట్టి పక్కా ప్లాన్స్ తో వ్యాపారులను దగ్గర కోట్లు కొట్టేస్తున్నారు. ఇదే తరహాలో ఈ నెల 1న 19 నుంచి 22శాతం కమీషన్ తో నోట్ల మార్పిడీ చేస్తామని చెప్పి బంజారాహిల్స్ లోని రాజకీయ నాయకుడు తిరుమలేష్ నాయుడుతో పాటు ఇన్ స్పెక్టర్ రాజశేఖర్ దోపిడీలకు తెరతీసారు. 17 మంది సభ్యులతో ఓ ముఠాగా ఏర్పడి మొత్తం 78 లక్షల రూపాయలు దోచేసారు. ఈ కేసులో నిందితులంతా తాము పోలీసులమని చెప్పి లక్ష్మణ్ అగర్వాల్ అనే వ్యాపారస్తుని వద్ద 30 లక్షలు, మాణిక్యా రెడ్డి వద్ద 25 లక్షలతో పాటు మరో ఇద్దరి వద్ద 23లక్షల రూపాయలను దోచేసారు. నోట్ల మార్పిడిలో పట్టుబడే వారు పోలీసులకు ఫిర్యాదుచేసే ఛాన్స్ లేదన్న ధీమాతో ఇప్పటి వరకు నోట్లమార్పిడి పేరుతో బెదిరింపులు దోపిడీలకు పాల్పడ్డ ఈ 17మంది సభ్యుల ముఠా…ఫిలింనగర్‌లోని జరిగిన ఈ దోపిడీ కేసుతో బైటపడింది. ఈ దొంగల సూడో పోలీస్ ఆపరేషన్ కు తన వంతు సహకారం అందించిన టప్పాచబుత్రా క్రైం ఇన్ స్పెక్టర్ రాజశేఖర్‌…ఈ కేసులో సినీఫక్కీలో దోపిడీకి మాస్టర్ ప్లాన్ వేసాడు. తిరుమలేష్ నాయుడుతో కలిసి ఈ నలుగురు వ్యాపారుల వద్ద తనిఖీల పేరుతో డబ్బుల సంచులు దోచేసిన ఇన్ స్పెక్టర్ రాజశేఖర్…ఎవరికైన చెబితే చంపేస్తామని ఈ గ్యాంగ్ మెంబర్స్ తో బెదిరించాడు. ఐతే దోపిడీకి గురైన లక్ష్మణ్ అగర్వాల్,రేవతం అనే ఇద్దరు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన స్పెషల్ టీమ్స్…ఇన్ స్పెక్టర్ రాజశేఖర్ తో పాటు తిరుమల్లేశ్‌ అతని ముఠాను అరెస్ట్ చేసారు. ఐతే ఈ దోపిడీలకు సూత్రదారి ఐన ఇన్ స్పెక్టర్ రాజశేఖర్ 2013లో నాంపల్లి పోలీస్ స్టేషన్ ఇన్స్ స్పెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు లంచం తీసకుంటు ఎసిబి కి చిక్కాడు. ఆ తరువాత కొన్ని రోజులు సస్పెన్షన్ లో ఉన్న రాజశేఖర్ ఇప్పుడు పాతబస్తీ టప్పాఛబుత్రా పీఎస్ డిటెక్టీవ్ ఇన్ స్పెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఐతే ఈ కేసులో రాజశేఖర్ ,తిరుమలేష్ నాయుడు సహా మరో 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు…వీరి వద్ద నుండి 52లక్షల 2000 కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఖాకీ వనంలో కలుపు మొక్కగా మారిన ఇన్ స్పెక్టర్ రాజశేఖర్ ఇంకొన్ని కేసుల్లో రాజకీయ నాయకులతో కలిసి సెటిల్ మెంట్లకు పాల్పడ్డట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి సంఘటనలపై మన పోలీస్ బాసులు.. కలుపు ఖాకీలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో.

ci-rajashekar

క్త్ర్రెమ్ సిఐ రాజశేఖర్

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.